పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లు కేంద్రం నెరవేర్చాలని ఇటీవల పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహ్దదుల్లో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల ప్రతిపదానలపై కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో చర్చలు కూడా జరిపారు. అయితే కేంద్రం కొన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుందని మంత్రులు తెలిపారు. దీంతో కొన్నిరోజుల పాటు రైతులు నిరసన చేయడం విరమించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రైతు సంఘాలు మరోసారి తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇటీవల నిరసనలు చేస్తుండగా ఘర్షణల్లో మృతిచెందిన రైతు శుభకరణ్ సింగ్ స్వగ్రామం బల్లోహ్‌లో.. రైతు సంఘాల నేతలు సర్వన్‌సింగ్ పంఢేర్, జగ్జీత్సింగ్ డల్లేవాల్ మీడియాతో మాట్లాడారు. రైతు ఉద్యమానికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Farmers Protest: మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేయనున్న రైతులు..
రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Translate this News: