Farmers Protest: మరోసారి ఉద్యమం ఉద్ధృతం చేయనున్న రైతులు.. రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. By B Aravind 04 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పంటలకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లు కేంద్రం నెరవేర్చాలని ఇటీవల పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహ్దదుల్లో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల ప్రతిపదానలపై కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతో చర్చలు కూడా జరిపారు. అయితే కేంద్రం కొన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుందని మంత్రులు తెలిపారు. దీంతో కొన్నిరోజుల పాటు రైతులు నిరసన చేయడం విరమించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రైతు సంఘాలు మరోసారి తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇటీవల నిరసనలు చేస్తుండగా ఘర్షణల్లో మృతిచెందిన రైతు శుభకరణ్ సింగ్ స్వగ్రామం బల్లోహ్‌లో.. రైతు సంఘాల నేతలు సర్వన్‌సింగ్ పంఢేర్, జగ్జీత్‌సింగ్ డల్లేవాల్ మీడియాతో మాట్లాడారు. రైతు ఉద్యమానికి సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు. Also Read: నేను రాజీనామా చేస్తున్నా…హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..! కేంద్రం తమ డిమాండ్లన్ని పరిష్కరించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం శంభు, ఖనౌరీ సరిద్దు పాయింట్ల వద్ద జరుగుతున్న ఆందోళనకు పంజాబ్, హర్యానా రైతులు మద్దతిస్తు్నారని.. మార్చి 6న మిగతా రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు కూడా ఢిల్లీకి చేరుకొని నిరసనలో పాల్గొనాలని రైతు సంఘాలు నిర్ణయించినట్లు కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) నేత సర్వన్‌సింగ్ పంఢేర్ పేర్కొన్నారు. ట్రాక్టర్, ట్రాలీ లాంటి వాహనాలలో చేరుకోలేని.. దూర ప్రాంతాల రైతులు.. రైళ్లు, ఇతర రవాణామార్గాల ద్వారా ఢిల్లీకి రావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు విస్తరించడానికి రెండు ఫోరమ్‌లు పనిచేస్తాయని తెలిపారు. మార్చి 10న మధ్యాహ్నం 12.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు దేశంలో రైల్‌రోకో చేపట్టి దేశంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పిలుపినిచ్చినట్లు ఫండేర్ తెలిపారు. అలాగే రైతుల డిమాండ్లకు మద్దతుగా పంజాబ్‌లో అన్ని పంచాయతీలు తీర్మానం చేస్తాయని.. ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ ఢిల్లీ సరిహద్దు పాయింట్ల చేరుకుంటుందని తెలిపారు. Also Read: భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే! #telugu-news #national-news #bjp #farmers-protest #msp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి