Farmers Protest: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్

తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ చర్చలు జరపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

New Update
Farmers Protest: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్

Farmers Protest Delhi: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులే రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న డిమాండ్ల కోసం.. కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో పాటు ప్రధాని మోదీ (PM Modi) కూడా చర్చలు జరపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం శంభు సరిహద్దు ప్రాంతంలో ‘కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ’ (Kisan Mazdoor Sangharsh Committee) ప్రధాన కార్యదర్శి శర్వాన్‌ సింగ్ పంథేర్‌ (Sarvan Singh Pandher) మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని.. లేకపోతే రైతులు శాంతియుతంగా ఆందోళన చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: ఆ ఊరంతా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే.. ఎక్కడో తెలుసా..

అలా ఎలా చేస్తారు

పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో రైతులపై భద్రత బలగాలు టియర్‌ గ్యాస్‌లు ప్రయోగించడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం మమ్మల్ని బలవంతంగా వెనక్కి పంపేందుకు చూస్తోందని మండిపడ్డారు. అందుకోసమే ఈ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నేట్‌ సేవలు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రైతు పండింటే ప్రతి పంటకు కనీస మద్దతు ధర (MSP) పాటు ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని రైతు సంఘాలు ఢిల్లీ చలోకు (Delhi Chalo) పిలుపునిచ్చాయి.

చర్చలకు 'సై' అన్న కేంద్రం

దీంతో పంజాబ్, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం (Central Government) వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. బారికేడ్లు, కాంక్రీట్‌ దిమ్మెలు, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేసింది. వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన రైతులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌లు, రబ్బర్‌ బుల్లెట్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్ర రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.

ప్రధాని చర్చలు జరపాల్సిందే

గురువారం సాయంత్రం 5 గంటలకు చంఢీగర్‌లో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయెల్‌ (Piyush Goyal), అర్జున్‌ ముండా, నిత్యానంద్‌ రాయ్‌లు.. రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. అయితే ప్రధాని మెదీ.. ఆ ముగ్గురు కేంద్ర మంత్రులతో చర్చలు జరపాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం రైతుల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలాఉండగా.. 'భారత్‌ కిసాన్ యూనియన్‌' పంజాబ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌ రోకోకు పిలుపునిచ్చింది. మరోవైపు టోల్‌ప్లాజాల వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన చేపట్టాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది.

Also Read: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్‌ ..ఎలక్టోరల్‌ బాండ్స్‌ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Advertisment
తాజా కథనాలు