Exercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం..

వ్యాయామం చేస్తే.. మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ మేలు ఉందని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. వాకింగ్ చేయడం, కాస్త వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడటం చేస్తే ఆడవారికి అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గాగా.. ఇంతే స్థాయిలో చేసే మగవారికి అకాల మరణం ముప్పు 15 శాతం తగ్గింది.

Exercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం..
New Update

Exercise Benefits : వ్యాయామం(Exercise) చేస్తే ఎవరికైనా మంచిదే. కానీ ఇది మగవారి(Men's) కంటే ఆడవారికే(Women's) ఎక్కువ మేలు చేస్తుందట. చూడటానికి ఇది ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది బయటపడింది. త్రెడ్‌మిల్‌(Thread Mill) మీద నడవడం(Walking), కాస్త వేగంగా పరిగెత్తడం(Running), ఆటలు ఆడటం(Playing Games) లాంటివి మగవారి కంటే.. ఆడవాళ్లకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీలో పబ్లిష్‌ అయిన అధ్యయనం తెలిపింది. వ్యాయామం చేసే ఆడవారిలో అకాల మరణం(Sudden Death) ముప్పు 24 శాతం తగ్గగా.. వారికి సమానంగా శ్రమించిన మగవారిలో అకాల మరణం ముప్పు 15 శాతం మాత్రమే తగ్గింది.

Also Read: వేడి వేడి టేస్టీ ఆనియన్ సూప్.. ట్రై చేయండి అదిరిపోతుంది

పురుషుల రెట్టింపు వ్యాయామం చేయాలి

అయితే గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పులు ఒకే స్థాయిలో తగ్గినా కూడా వీటి ద్వారా వస్తున్న మరణాల్లో కూడా చాలా తేడా కనిపించింది. ప్రతిరోజూ వ్యాయామం చేసే మహిళల్లో గుండెపోటు, పక్షవాతం వంటి వాటితో 34 శాతం మరణించే ముప్పు తగ్గింది. ఇక మగవారిలో ఇది కేవలం14 శాతం తగ్గింది. వారానికి 140 నిమిషాలు వ్యాయామం చేసిన మహిళల్లో అకాల మరణ ముప్పు 18 శాతం తగ్గగా.. పురుషులకు కూడా 18 శాతం అకాల మరణ ముప్పు తగ్గాలంటే వాళ్లు రెట్టింపు వ్యాయాం చేయాల్సి ఉంటోంది. అంటే దాదాపు 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటోందని పరిశోధకులు వెల్లడించారు.

కాస్త టైం దొరికినా వ్యాయామం చేయండి

మరోవైపు వ్యాయామాల రకాలు, వాటి తీవ్రత, సమయం ఇలాంటివి పరిగణలోకి తీసుకున్నా కూడా మహిళలకే ఎక్కువగా ప్రయోజనం ఉంది. అందుకే వ్యాయామం చేసేందుకు టైమ్ లేదని అనుకునే మహిళలు కాస్త ఖాళీ సమయం దొరికినా.. కొంచెం సేపు వ్యాయామం చేయడం.. బయటికి వెళ్లి వాకింగ్ చేయడం లాంటివి చేస్తే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read : ధనియాల నీళ్లు తాగితే.. శరీరంలో అవి తగ్గిపోతాయి..!

#telugu-news #health-tips #womens #mens #excercise
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe