Telangana : రాష్ట్రంలో బీర్ల కొరత.. క్లారిటీ ఇచ్చిన ఎక్సైజ్‌ శాఖ

తెలగాణలో బీర్ల కొరత ఉందని.. ఇటీవల వార్త కథనాలు నేపథ్యంలో తాజాగా ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. రాష్ట్రంలో బీర్ల కొరత లేదని స్పష్టం చేసింది. కేవలం కింగ్‌ఫిషర్‌ బీర్లకి మాత్రమే కొరత ఉందని పేర్కొంది.

Telangana : రాష్ట్రంలో బీర్ల కొరత.. క్లారిటీ ఇచ్చిన ఎక్సైజ్‌ శాఖ
New Update

Beer Shortage In Telangana : తెలగాణలో బీర్ల కొరత (Beer Shortage) ఉందని.. ఇటీవల వార్త కథనాలు వచ్చాయి. ఎక్సైజ్‌ శాఖ (Excise Department) ఎక్కువ బీర్లు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ పలు వార్తాసంస్థలు ఆరోపించాయి. అయితే దీనిపై తాజాగా ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ' ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు బీరు బ్రాండ్లు ఉన్నాయి. వీటికి లైసెన్స్‌ (License) ప్రకారమే ఉత్పత్తి చేసుకోనేలా పర్మిషన్లు ఇచ్చాము. సాధారణంగా బీర్లు ఉత్పత్తి చేసేందుకు ఒక షిప్టుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ వీటికి డిమాండ్ పెరగడంతో మూడు షిఫ్టుల్లో అనుమతులు ఇచ్చాము. ఈ ఆరు బీరు బ్రాండుల్లో.. కేవలం నాలుగు మాత్రమే మార్కెట్‌లో 95 శాతం అమ్ముడుపోతున్నాయి. వీటికి మూడు షిఫ్టుల్లో ఆపరేట్ చేసుకునేందుకు అనుమతి ఉంది.

Also Read: తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వాన లేఖ

ఈ నాలుగు బీర్‌ బ్రాండ్లు కూడా ఒక షిఫ్టుకు 1,66,000 బీర్ కేసులు, మూడు షిఫ్టులకు కలిపి మొత్తం 4,98,000 బీర్‌ కేసులు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది. అయినప్పటికీ ఈ నాలుగు బీర్‌ బ్రాండ్‌ కంపెనీలు మాత్రం రోజుకు 2.51 లక్షల బీర్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. వేసవి (Summer) లో సగటున ప్రతిరోజూ 2 లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి. కానీ ప్రస్తుతం బీర్ కంపెనీల వద్ద ఇంకా 7.57 లక్షల బీర్ కేసులు అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎక్కడా కూడా బీర్ల కొరత లేదు. ఒక్క కింగ్‌ఫిషర్‌ బీర్‌ బ్రాండ్‌కు మాత్రమే కొరత ఉంది. అదికూడా ఈ కంపెనీ యాజమాన్యం తక్కువ బీర్లు ఉత్పత్తి చేయడం వల్ల ఈ కొరత ఏర్పడింది. రాష్ట్రంలో బీర్లు అందుబాటులో ఉండేలా.. అధికారులు చర్యలు తీసుకున్నారని' పేర్కొంది.

కొత్త వైన్ కంపెనీలకు కొన్ని కఠినమైన నిబంధనలతో.. రాష్ట్ర బివరేజ్‌ల కార్పొరేషన్‌కు తమ స్టాక్‌ను సరఫరా చేసే అనుమతి ఉంది. గత ఐదేళ్లలో మొత్తం 360 బ్రాండ్లకు అనుమతి ఇచ్చాము. గత ఐదు నెలల్లో నాలుగు బీర్‌ బ్రాండ్లు రిజిస్టర్ చేసుకున్నాయి. కాబట్టి రాష్ట్రంలో బీర్ల కొరత ఉందని చేసిన ఆరోపణలన్నీ మేము ఖండిస్తున్నామని' ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Also Read: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆమోదం.. మార్చిన గీతం ఇదే!

publive-image

#telugu-news #telangana #excise-department #beers #kingfisher
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe