Lavu Sri Krishna Devarayalu : నరసరావు పేట ఎంపీ సీటును ఎలా సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు లావు శ్రీకృష్ణదేవరరాయలు(Lavu Sri Krishna Devarayalu). ఇటీవల ఈ సీటు విషయమై వైసీపీతో విభేదాలు వచ్చి పార్టీకి, ఎంపీ పదవికీ కూడా రాజీనామా చేశారు శ్రీకృష్ణ దేవరాయలు. ఇప్పుడు అదే లక్ష్యంతో ఢిల్లీ(Delhi) లో ఉన్న చంద్రబాబు(Chandrababu) ను కలిసినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా నర్సరావుపేట నుంచే పోటీ చేయనివ్వమని శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుని అడిగినట్టు సమాచారం.
Also Read : Telangana:నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నరసరావు పేట సెంటిమెంట్...
రత్తయ్య విజ్ఞాన్ స్కూల్స్ అధిపతి అయిన లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేశరాయలు. తండ్రి తర్వాత మొత్తం స్కూల్స్, బిజినెస్ వ్యవహారాలన్నీ ఇతనే చూస్తున్నారు. దాంతో పాటూ నరసరావు పేట(Narasaraopeta) ఎంపీగా కూడా సేవలు అందించారు. ఇతనికి ఎంపీగా మంచి పేరు ఉంది. బాగా చదువుకున్నవారు కావడం వలన పార్లమెంటులో బాగా మాట్లాడతారని కూడా పేరు ఉంది. అయితే ఇతని బలమంతా నరసారావు పేటనే. చాలా ఏళ్ళుగా అక్కడే ఉండడం...అక్కడి నుంచే గెలవడం వలన.. ఆ ప్రాంతం, ప్రజలతో గట్టి అనుబంధం ఉంది. అందుకే ఈసారి కూడా నరసారావు పేట నుంచే పోటీ చేస్తానని మంకు పట్టు ప్టుటకుని కూర్చున్నారు శ్రీకృష్ణదేవరాయలు.
అదే కావాలని పట్టు...
అయితే గెలుపు కోసం పార్టీ ఇంఛార్జ్‌లలో మార్పులు చేస్తున్న వైసీపీ(YCP) అధిష్టానం దేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని కోరింది. కానీ అది తనకు ఇష్టం లేదని... నరసారావు పేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు శ్రీకృష్ణ దేవరాయలు. దానికి అధిష్టానం ఒప్పుకోకపోవడంతో పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే సీటు కోసం టీడీపీలో జాయిన్ అవ్వనున్నారని... ఆవిషయమే టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఏమన్నారు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.