Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు (Free Bus) సౌకర్యం అమలవుతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఈ పథకం వరిస్తోంది. ఒక్క లగ్జరీ బస్సుల్లో తప్ప మిగతా అన్ని బస్సుల్లో కూడా వీళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల చాలామంది మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: రామాలయ ప్రారంభోత్సవం.. దేశానికి రూ. 50,000 కోట్ల వ్యాపారం..
గిరాకీ లేదు
అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులకి రావడంతో.. ప్రయాణికుల మీద ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు (Auto Drivers) మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. మహిళా ప్రయాణికులు లేక గిరాకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా ఆదుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే ఈ అంశంపై తాజాగా మజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ స్పందించారు.
నెలకు రూ.15 వేలు ఇవ్వాలి
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) రోడ్డున పడేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి పథకమే అయినప్పటికీ.. ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకరికి మంచి చేస్తూ వేరవాళ్ల ఉసురు పోసుకోవడం సరికాదన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యాలను పెంచాలని కోరారు.
Also Read: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ వినతి..