Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ

ఏపీలో పెన్షన్ల అంశం చర్చనీయాంశవుతోంది. పెన్షన్స్ ఇవ్వొద్దని ఈసీకి చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ? అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.

New Update
Perni Nani: పెన్షన్లు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసింది మీరు కాదా ?: పేర్ని నానీ

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లలపై రాజకీయ రగడ నెలకొంది. సిటిజన్‌ ఫర్ డెమొక్రసీ అనే పేరుతో ఎన్నికల సంఘానికి పెన్షన్లు ఆపేయాలని ఫిర్యాదు చేయడంతో.. వైసీపీ నేతలు టీపీడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దీనిపై స్పందించారు. ' మాటలు మార్చడంలో చంద్రబాబు సిద్ధస్తుడు. జగన్ మోహన్ రెడ్డి పెన్షన్‌లతో పేదల పొట్టకొట్టారని చంద్రబాబు అంటున్నారు. పెన్షన్స్ ఇవ్వొద్దని చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు చేసింది నిజం కాదా ?. నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబుకు ఉన్న అక్రమ సంబంధాలు ప్రజలకు తెలియదా ? పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం మీరే కాదా ?.

Also read: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి.. పేదల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ?. కేంద్ర ఎన్నికల సంఘం వాలీంటీర్స్‌ను తప్పించమనగానే సంబరాలు చేసుకున్నారు. ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పేదల ఉసురు చంద్రబాబు కచ్చితంగా తగులుతుంది. గతంలో వాలీంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోయారా?. వాలీంటీర్స్‌ను జగన్ వ్యక్తిగత పెగాసెస్ అంటూ హడావిడి చేశారు. ఇప్పుడు నెలకు 50 వేలు జీతం ఇస్తా అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని' పేర్ని నాని అన్నారు.

Also Read: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రకటన.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

Advertisment
తాజా కథనాలు