KCR: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

KCR: సీఎం రేవంత్ దూకుడు.. కేసీఆర్ కీలక నిర్ణయం
New Update

Ex CM KCR: దక్షిణ తెలంగాణ జిల్లాల నేతలతో బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) విమర్శలు గుప్పించారు కేసీఆర్. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను (Krishna Projects) కేఆర్ఎంబికి (KRMB) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ…కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13 న నల్గొండలో భారీ బహిరంగ సభ (Nalgonda Public Meeting) నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

ALSO READ: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు!

కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబి కి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని., కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామని., ప్రజా క్షేత్రం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదని పేర్కొన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవాల్సి వస్తుందని అన్నారు. మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని కేసీఆర్ చురకలు అంటించారు.

ALSO READ: అబద్దాలతో ప్రభుత్వాన్ని నడపలేరు.. సీఎం రేవంత్‌పై హరీష్ ఫైర్

DO WATCH:

#kcr #cm-revanth-reddy #brs-party #krmb #krmb-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe