Rooftop Solar Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు.. ఈ స్కీమ్ గురించి తెలుసా?

సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన' అనే స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌తో ఇళ్లపై రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది.

New Update
Rooftop Solar Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు..  ఈ స్కీమ్ గురించి తెలుసా?

PM Surya Ghar Muft Bijli Yojana: సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించి సౌర విద్యుత్‌ వినియోగాన్ని పెంచేందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన' అనే స్కీమ్‌తో సోలార్‌ ప్యానెళ్లు అమర్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రూ.75 వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంలో భాగంగా కోటి ఇళ్లకు ప్రతినెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ప్రస్తుతం సోలార్ ప్యానెళ్లపై కూడా ప్రజల్లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్‌ ప్యానెళ్లపై సబ్సిడీ  ఇస్తున్నాయి. దీంతో పాటు బ్యాంకు కూడా రుణం ఇస్తున్నాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకొని 1 కిలోవాట్‌ నుంచి 3 కిలోవాట్లు లేదా అంతకన్నా ఎక్కువ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు.

Also Read:  బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు.. భయాందోళనలో హిందువులు

ప్రస్తుతం నాలుగు రకాల సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాలీ క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్, నాన్ క్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్‌, బైఫేషియల్ సోలార్ ప్యానెల్స్, హాఫ్ కట్ మోనో పెర్క్ సోలార్ ప్యానెళ్లను ప్రస్తుతం సామాన్యుల ఇళ్లలో లేదా పొలాల్లో అమర్చుతున్నారు. అయితే.. ఎవరైనా సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, వాళ్ల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలు మాత్రమే సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తాయి. 1 కిలో వాట్‌ రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ ప్యానెళ్లకు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్లు అంతకన్నా ఎక్కువ కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లకు (10 కిలోవాట్ల లోపల వరకు) రూ.78 వేలు సబ్సిడీ వస్తుంది.

Also Read: ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తున్నాయి. కేంద్రం 60 శాతం సబ్సిడీ ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు 30 నుంచి 40 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. అలాగే 10 నుంచి 20 శాతం వరకు బ్యాంకు నుంచి కూడా లోన్‌ తీసుకొని సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను (Rooftop Solar Panel) అమర్చుకునేందుకు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి  https://pmsuryaghar.com/ వెళ్లాలి. ఆధార్‌ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న మొబైల్ నెంబర్, కరెంట్ బ్యాంకు ఖాతా, కరెంట్ బిల్లు, రేషన్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం వంటి తదితర డాక్యుమెంట్లు సమర్పించి ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు