Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?

మన దేశంలో ప్రతీ గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రాజస్థాన్‌లో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.

Rape Cases : ప్రతీ గంటకు నాలుగు రేప్‌లు.. మహిళలకు భద్రతెక్కడ ?
New Update

4 Rape Cases For Every Hour : సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటా, బయటా, పని ప్రదేశాల్లో ఇలా ఎక్కడ చూసినా మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ప్రతీ గంటకు సగటున నలుగురు లైంగిక దాడులకు గురవుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2017 నుంచి 2022 మధ్య ఒక రోజుకు సగటున 86 రేప్ కేసులు (Rape Cases) నమోదయ్యాయి. ఇందులో 82 కేసుల్లో రేపిస్టులు బాధిత మహిళలకు తెలిసినవాళ్లే. 2017 నుంచి 2022 మధ్య దేశంలో మొత్తం 1.89 లక్షల లైంగిక దాడుల కేసులు నమోదుకాగా.. ఇందులో 1.91 లక్షల మంది బాధితులుగా ఉన్నట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (NCRB) నివేదిక వెల్లడించింది. ఇక 2018లో ప్రతీ 15 నిమిషాలకొకసారి సగటున ఓ మహిళ అత్యాచారానికి గురైంనట్లు పేర్కొంది.

Also Read: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..

అత్యాచార కేసుల్లో మహిళలకు తెలిసినవాళ్లే ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇలా భారీ సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులు (Sexual Assault) జరుగుతుంటే నిందితులకు పడుతున్న శిక్షలు మాత్రం చాలా తక్కువ. 2014-2022 మధ్య శిక్ష రేటు 27-28 శాతం మధ్యే ఉందని ఎన్సీఆర్బీ తెలిపింది. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా 5,399 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్‌(3,029), మహారాష్ట్ర(2,904), యూపీ(3,690), ఢిల్లీ(1,212) రాష్ట్రాలు ఉన్నాయి

ప్రతి లక్ష జనాభాను చూస్తే ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా లైంగిక దాడులు 15 ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 14 చొప్పున చంఢీగఢ్‌, రాజస్థాన్‌, హర్యానాలో 13, ఢిల్లీ, లక్ష్యద్వీప్‌లో 12 ఉన్నాయి. 2022లో దేశంలో ప్రతి లక్ష జనాభాకు ఐదుగురు లైంగిక దాడులకు గురైనట్లు గణాంకాలు వెల్లడించాయి. మహిళలకు పని ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా భద్రత లేకుండా పోయింది. తోటి ఉద్యోగులు, యజమానులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి.

Also read: ఎల్లుండి భారత్ బంద్‌కు పిలుపు!

పని ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. యజమానులు, సహచర ఉద్యోగులే మహిళలపై ఆఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒకరు చొప్పున లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలాఉండగా.. 2012లో ఢిల్లీలో సామూహిక లైంగిక దాడి, హత్య ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు ఉద్దేశించిన ఈ ఫండ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం (2023-24 Financial Year) నాటికి నిర్భయ ఫండ్‌కు రూ.7,213 కోట్లు కేటాయించగా.. 2023, డిసెంబర్ 8 నాటికి రూ.5,119 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఇందులో దాదాపు 30 శాతం నిధులను వినియోగించలేదు. ఖర్చు చేసిన వాటిలో కూడా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి 8 పెద్ద నగరాల్లోనే వినియోగించినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ తెలిపింది.

#telugu-news #india #sexual-assault #rape-cases
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe