Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు

సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.

New Update
Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు

సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి వరలక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. తాము గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని, చాలీ చాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో కేసీఆర్‌ తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌.. తమకు ఇచ్చిన హామీని పట్టించుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలని గత 5 సంవత్సరాలుగా తాము మంత్రుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, కానీ మంత్రులు తమకు సమయం కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు తమను అవమాన పరిచారని, పదే పదే ఎందుకు వస్తున్నారంటూ విసుక్కున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ ఉద్యోగానికి భద్రత కల్పించి, తమ జీతాన్ని పెంచాలని వారు కోరారు. లేకుంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమను నమ్మబలికి తమ ఓట్లను లాక్కున్న కేసీఆర్‌ తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయకపోతే తాము ఏంటో ఎన్నికల్లో చూపిస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు