ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవలే తమ న్యూరాలింక్ సంస్థ.. విజయవంతంగా ఓ మనిషి మెదడులో చిప్‌ను ప్రవేశపెట్టిందని.. అది స్పందిస్తుందని ప్రకటన చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అయితే తాజాగా ఆయనకు ఓ సమస్య ఎదురైంది. ఇటీవలే ఆయన విండోస్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశారు. అందులో మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ కావాల్సి వచ్చింది. కానీ మస్క్ విండోస్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో తన సమస్యను ఎక్స్‌లో చెప్పారు. సరైన స్పందన రాకపోవడంతో.. చివరికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదేళ్లకే మెసెజ్ పెట్టారు.
Also Read: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే విండోస్ వినియోగించేలా అనుమతించాలని కోరారు. కంప్యూటర్ వైఫైకి కనెక్ట్ అయితే.. ఆ ఆప్షన్ కనిపించకుండా పోతుందని.. అలాగే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా వర్క్ ఈమెయిల్ అడ్రస్ వాడుకోలేమని అన్నారు. నాకు వర్క్ ఈమెయిల్స్ మాత్రమే ఉన్నాయని చెప్పారు. అయితే దీనిపై సత్య నాదేళ్ల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
అయితే ఇంతకుముందు కూడా ఇదే అంశంపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఎంఎస్ అకౌంట్ లేకుండా కొత్త ల్యాప్‌టాప్‌ను యాక్సె్స్ చేయలేకపోతున్నానని అన్నారు. మైక్రోసాఫ్ట్ అర్టిఫిషయ్ ఇంటిలిజెన్స్‌కు తన కంప్యూటర్ యాక్సె్స్ ఇవ్వాలనుకోవడం లేదని.. ఇదంతా చూడటానికి గందరగోళంగా ఉందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్‌కు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: ఆయన భార్య పేరు మరిచిపోయారు.. ట్రంప్‌పై జో బైడెన్ విమర్శలు