/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T112256.734.jpg)
Elon Musk Targets WhatsApp: సోషల్ మీడియా యాప్స్‌లో నెటీజన్లు ఎక్కువ ఉపయోగించే వాటిలో వాట్సాప్ ఒక్కటి. చాలామంది మెసెజ్‌లు, ఫోన్ కాల్స్ చేసేందుకు ఈ యాప్‌ను వినియోగిస్తుంటారు. అంతేకాదు ఇందులో ఎండ్ టూ ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఫీచర్ ఉండటం వల్ల ప్రైవసీ ఉంటుందనే కారణంతోనే దీనివైపే చాలామంది మొగ్గుచూపుతున్నారు. అయితే తాజాగా టెస్లా, ఎక్స్ తదితర కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిరోజూ రాత్రి యూజర్ల డేటాను వాట్సాప్ ఎక్స్‌పోర్ట్ చేస్తోందని ఆరోపించారు.
Also Read: ముస్లిమేతరులపై పాకిస్తాన్ లో దాడులు.. టెన్షన్ లో ప్రజలు..
ఇక వివరాల్లోకి వెళ్తే.. యూజర్ల సమాచారాన్ని ప్రతిరోజూ రాత్రి వాట్సాప్ ఎక్స్‌పోర్టు చేస్తోందని.. ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం యాడ్స్ కోసమ వాడుకుంటోందని ఓ యూజర్ పోస్ట్ చేశాడు. వాట్సాప్ కంపెనీ తమ యూజర్లను కస్టమర్‌గా కాకుండా వస్తువుల్లాగా చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఎలాన్ మాస్క్ స్పందించారు. ప్రతిరోజూ రాత్రి మీ డేటాను వాట్సాప్ ఎక్స్‌పోర్టు (WhatsApp Exporting Data) చేస్తోందని.. కొంతమంది వాట్సాప్‌లో తమ డాటా భద్రంగానే ఉందన్న భ్రమలో ఉన్నారంటూ బదులిచ్చారు. మరోవైపు మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై వాట్సాప్ గానీ.. మెటా గానీ ఇంకా స్పందించలేదు. గతంలో కూడా ఈ కంపెనీలపై ఎలాన్ మస్క్ ఆరోపణలు చేశారు.
Also Read: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఘనత సాధించిన 12వ తరగతి విద్యార్థి!