Elon Musk Key Comments : టెస్లా (TESLA) సీఈవో, స్పేస్ ఎక్స్ (SPACE X) అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. అంగారకుడిపై మానవ కాలనీ ఏర్పాటు చేయకముందే తాను చనిపోతానని అన్నారు. ఇప్పటికే స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ -9 వంటి హెవీ రాకెట్లను తయారుచేసినా కూడా మార్స్‌పై మానవ నివాసాల ఏర్పాటులో ఉన్న ఆటంకాలను మస్క్ (Elon Musk) వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మరికొన్ని దశాబ్దాల్లో మనిషి మార్స్‌పైకి చేరుకునే ఛాన్స్ ఉన్నా కూడా.. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.
Also read: బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గండి.. విపక్షాల ఒత్తిడికి వెనక్కి తగ్గిన కేంద్రం
2020లో జరిగిన శాటిలైట్ కాన్ఫరెన్స్‌లో ఎలాన్ మస్క్ మాట్లాడారు. పురోగతి వేగాన్ని పెంచకపోతే మనం అంగారకుడిపైకి వెళ్లే సమయానికి నేను బతికి ఉండను అంటూ వ్యాఖ్యానించారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేయగలిగితే.. ఒక వ్యక్తి మార్స్ (Mars) పైకి వెళ్లేందుకు లక్ష డాలర్ల నుంచి ఐదు లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని గతంలోనే ఆయన అంచనా వేశారు. అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తీవ్రమైన అడ్డంకులు దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే ఒక టన్ను మెటీరియల్‌ను అంగారకుడిపైకి చేర్చడం కోసం.. కనీసం 1.40 లక్షల డాలర్లు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. ఇక పూర్తిస్థాయిలో వినియోగించుకునే మానవ నివాసం ఏర్పాటు కోసం ఏకంగా 100 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇంత డబ్బు ఖర్చును చేయడంతో పాటు అత్యాధునిక సాంకేతికత ఉంటేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు.
అయితే ఇటీవల ఎక్స్‌లో ఓ యూజర్ మరికొన్నేళ్లలో మనం అంగారకుడిపై అడుగు పెడతామని పోస్ట్ చేశారు. దీనికి మస్క్ స్పందించారు. ఐదేళ్లలో మార్స్‌పై మానవరహిత యాత్ర విజయవంతవుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లలోపే అక్కడ మనుషులను కూడా పంపిచగలుగుతామని చెప్పారు. ఇక 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తామని.. 30 ఏళ్లకు కచ్చితంగా అంగారకుడిపై సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుమదని తెలిపారు.
Also Read: లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా!