Andhra Pradesh : వెంటనే సిట్ ఏర్పాటు చేయండి.. సీఎస్‌కు ఈసీ ఆదేశం

ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

New Update
ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు

Polling : ఏపీ(AP) లో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలు, 12 మంది దిగువస్థాయి పోలీసు అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. ఈరోజు తాజాగా మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఫోన్ చేసింది. వెంటనే సిట్‌ను ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల్లోనే ఈ అల్లర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ అల్లర్లలో ఒక్క కేసును కూడా వదలకూడదని.. ఇంతకు ముందు పెట్టిన సెక్షన్లకు అదనంగా మిగతా సెక్షన్లు జోడించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

Also Read: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన ప్రభాస్.. ఇన్‌స్టా స్టోరీ వైరల్..!

ఇదిలాఉండగా.. ఈ అల్లర్లకు సంబంధించి గురువారం సీఎస్‌ జవహార్ రెడ్డి(CS Jawahar Reddy), డీజీపీ హరీశ్ గుప్తా(DGP Harish Gupta), ఇంటెలిజెన్స్‌ డీజీ విశ్వజీత్‌.. కేంద్ర ఎన్నికల కమిషన్ల ముందు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై ఈసీ అధికారిక ప్రకటన చేసింది. ఏపీలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలకు సూటిగా చెప్పామని ఈసీ తెలిపింది.

Also Read:  ప్రతి నెల ఉచితంగా 10 కిలోల బియ్యం.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు