EC Releases Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించామని ఎస్బీఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission).. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్‌లోడ్ చేసింది.
Also Read: తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదల..చెన్నై సెంట్రల్ నుంచి తమిళిసై.!
అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 21లోపు ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను అందించాలని మార్చి 18న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి సీరియల్ నెంబర్స్‌తో సహా పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు (Supreme Court) సమర్పించింది.
ఇటీవల ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) ఏ సంస్థలు కొన్నాయి, పార్టీలకు ఎంత విరాళాలు వచ్చాయి అన్న వివరాలను బయటపెట్టాయి. కానీ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ల వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా అందజేశారని తెలియజేసే ఈ నంబర్లు లేకపోవడంతో సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీంతో పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు.. ఎస్బీఐని ఆదేశించించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్పీఐ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం సమర్పించింది.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఐ అన్ని వివరాలు బయటపెట్టామని.. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయలేదని ఎస్బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు తప్ప.. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని విషయాలు బయటపెట్టామని తెలిపింది. అయితే తాము బయటపెట్టిన యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు బాండ్లను గుర్తిస్తాయని.. అలాగే విరాళాలు ఏ పార్టీకి వెళ్లాయో అని తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయని చెప్పింది.
Also Read: ఆ రాష్ట్రంలో నీటి కష్టాలు.. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం