Supreme Court: 'వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లు పంపడం ఆపండి'.. కేంద్రానికి ఆదేశించిన సుప్రీంకోర్టు

వాట్సాప్‌లో 'వికసిత భారత్‌' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి.. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమేనని ఎన్నికల సంఘం తెలిపింది.

New Update
ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Supreme Court On Viksit Bharat Messages: దేశంలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా తమ ప్రచారాలు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission).. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్‌లో (WhatsApp) 'వికసిత భారత్‌' అనే సందేశాలు పంపించడం వెంటనే ఆపాలంటూ ఆదేశించింది. ఇందుకు సంబంధించి గురువారం ఐటీ మంత్రిత్వశాఖకు సూచనలు చేసింది.

Also Read: ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్ని సమర్పించాం: ఎస్బీఐ

వికసిత్ భారత్ (Viksit Bharat) సందేశాలు వాట్సాప్‌లో వస్తున్నాయని పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. కేంద్రానికి ఆ సందేశాలను పంపడం ఆపేయాలంటూ ఆదేశించింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమేనని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొద్దిగంటల్లో ఎన్నికల షెడ్యూల్‌ రానుండగా.. ప్రధాని మోదీతో (PM Modi) లేఖతో ఉన్న వాట్సాప్‌ సందేశాలను కేంద్ర ప్రభుత్వం పంపింది.

వికసిత భారత్ పేరటి అవి వస్తున్నాయి. అయితే నెట్‌వర్క్ సమస్య వల్ల మార్చి 16న పంపిన మెసేజ్‌లు కొందరికి ఆలస్యంగా వెళ్తున్నాయని ఎన్నికల సంఘానికి ఐటీశాఖ వివరించింది. ఇదిలాఉండగా.. పార్లమెంట్‌, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ (Election Code) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోడ్‌ అమల్లోకి వచ్చాక కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసేలా వాట్సాప్‌లలో మెసేజ్‌లు వస్తున్నాయని ఈసీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం.. కేంద్రానికి ఈ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ప్రధానిపై రాళ్ల దాడి.. ముక్కు పగిలి రక్తం చిమ్మినా ఆగని ప్రసంగం!

Advertisment
తాజా కథనాలు