YS Sharmila: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. తనకు శిక్ష పడలేదని రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పదేపదే తన గురించి ప్రస్తావిస్తున్నారని దస్తగిరి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు, దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్.. షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లఘించినట్లుగుర్తించింది. కాగా.. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. గడువులోగా వివరణ ఇవ్వకుంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ALSO READ: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
వివేకా కేసుపై కోర్టు కీలక ఆదేశాలు...
వైఎస్ వివేకా హత్య కేసుపై కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వివేకా హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆంక్షలు పెట్టింది. కాగా ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసుపై ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కడప వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టు ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో వివేకా హత్యపై మాట్లాడొద్దంటూ వై.ఎస్.షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ లకు కోర్టు సూచనలు చేసింది.