AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు!

పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు!

EC Transfers SI And CI in Palnadu: పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

జగన్ ప్రభుత్వానికి ఈసీ వరుస షాక్ లు..
ఎన్నికల వేళ జగన్ (CM Jagan) ప్రభుత్వానికి ఎన్నికల సంఘం వరుస షాక్ లు ఇస్తుంది. ఇప్పటికే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ PSR ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది. ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా.. విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై కూడా బదిలీ వేటు పడింది.

Also Read: నేటి నుంచి ఇంటర్‌ ప్రవేశాలు ప్రారంభం..

Advertisment
తాజా కథనాలు