Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి షోకాజ్‌ నోటీసులు పంపిన ఎలక్షన్‌ కమిషన్.. ఎందుకో తెలుసా..

ఇటీవల రాహుల్‌ గాంధీ.. ప్రధాని మోదీని పనౌటి, జైబ్‌కత్రా (జేబుదొంగ)తో పోల్చడంతో బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీఐ రాహుల్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే నవంబర్‌ 25న ఎన్నికల కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

New Update
MP Rahul Gandhi: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

మొన్న జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. మనవాళ్లను పనౌటి (మోదీ) ఓడిపోయేలా చేశారన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆ తర్వాత రాహుల్.. ప్రధాని మోదీని పిక్‌పాకేట్‌ (జేబుదొంగ)తో పోల్చడం కూడా చర్చనీయాంశమైంది. అయితే దీన్ని బీజేపీ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. మోదీపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీపై భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్‌ తాజాగా రాహుల్‌ గాంధీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే నవంబర్ 25 ఎలక్షన్ కమిషన్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది.

Also Read:తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్‌ కళ్యాణ్‌

అయితే ఇటీవల రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని బర్మర్‌ అనే ప్రాంతంలో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని పిక్‌పాకెట్‌తో పోల్చారు. ' పిక్‌పాకెట్ (జేబు దొంగ) ఒంటరిగా రాడు. ఇందులో ముగ్గురు ఉంటారు. ఒకరు ముందు నుంచి వస్తారు, మరొకరు వెనక నుంచి వస్తారు, ఇంకొకరు దూరం నుంచి వస్తారు. ప్రధాని మోదీ టీవీలో కనిపించి ముందు నుంచి వస్తారు. ఆ తర్వాత హిందూ ముస్లీం, డీమోనిటైజేషన్, జీఎస్టీ లాంటి అంశాలను లేవనెత్తుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తారు. అనంతరం అదాని వెనక నుంచి వచ్చి డబ్బులు తీసుకుంటారని' రాహుల్ అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే భారత ఎన్నికల సంఘానికి(ECI) ఫిర్యాదు చేసింది. ఒక వ్యక్తిని జైబ్‌కత్రా (జేబుదొంగ) అని దూషించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాదని.. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా హత్య చేయడమేనని బీజేపీ తాము ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు అతని ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్‌.. రాహుల్‌కి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. నవంబర్‌ 25న ఎలక్షన్ కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు