Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే

చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఓ లారీలో రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన లారీలో ఇవి పట్టబడ్డాయి. అనంతరం అధికారులు వీటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.

New Update
Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే

Gold Seized : చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్(Election Flying Squad) వాహనాలను తనిఖీ చేయగా.. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వీటిని ఆదాయపు పన్నుశాఖకు అప్పగించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాంచీపురం జిల్లా కుండ్రత్తూర్‌ సమీపంలోని వండలూరు – మీంజూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలోనే చెన్నై ఎయిర్‌పోర్టు(Chennai Airport) నుంచి సరుకులు తీసుకెళ్తున్న ప్రైవేటు ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన లారీని చెక్ చేశారు. దీంతో అందులో బంగారు కడ్డీలు ఉండటాన్ని చూసి అధికారులు కంగుతిన్నారు.

Also Read: సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు చేసిన నిందితులు అరెస్టు..

శ్రీపెరంబదూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 1425 కేజీలు ఉన్న ఆ బంగారు కడ్డీలను సీజ్(1425Kgs Gold Seized) చేశారు. వీటి విలువ మార్కెట్లలో రూ.100 కోట్లు ఉంటుందని తెలిపారు. అయితే సరైన ధ్రువపత్రాలు అందిస్తే.. కలెక్టర్‌ నేతృత్వంలో ప్రైవేట్ కొరియర్‌ కంపెనీకి వీటిని తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు: పవన్ కల్యాణ్

Advertisment
తాజా కథనాలు