Best Fruits : జలుబు చేస్తే తీపి పదార్థాలు తినకూడదని సాధారణంగా చెబుతారు. ముఖ్యంగా పండ్లు తింటే కఫం ఎక్కువగా వస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ కొన్ని పండ్లలో ఎక్స్పెక్టరెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఈ పండ్లను చలికాలం(Winter Season) లో లేదా జలుబు సమయంలో తీసుకోవచ్చు. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి(Immune Power) ని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం అన్ని పండ్లను తినకూడదని చెబుతున్నారు.
ఆపిల్:
- ఆపిల్(Apple) లో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు(Anti Cancer Properties) కూడా ఉన్నాయి. జలుబును నివారించే శక్తి కూడా దీనికి ఉంది.
అరటిపండు:
- సాధారణంగా జలుబు(Cold) చేస్తే అరటిపండ్లు తినవద్దని చెబుతుంటారు. కానీ అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది జలుబు, సీజనల్ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. డిప్రెషన్, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
సిట్రస్ ఫలాలు:
- జలుబు చేసినప్పుడు మనం తీసుకోవలసిన ముఖ్యమైన పండ్లలో నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది.
పైనాపిల్:
- పైనాపిల్లో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ జలుబు రాకుండా నిరోధిస్తాయి. డీహైడ్రేషన్ ఉన్నవారు పైనాపిల్ పండును మితంగా తీసుకోవచ్చు.
పుచ్చకాయ:
- పుచ్చకాయ(Watermelon) లో శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్, వాటర్ కంటెంట్ అధికంగా ఉండటంతో జలుబు తగ్గుతుంది. అంతేకాకుండా అంటువ్యాధులు దరిచేరవని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చుండ్రుతో బాధపడుతున్నారా? కర్పూరంతో ఇలా చేయండి..మేజిక్ చూడండి