Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే

పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం ఆపిల్, అరటిపండు, సిట్రస్‌ ఫలాలు, పైనాపిల్, పుచ్చకాయ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జలుబును నివారించే శక్తి కూడా వీటికి ఉందని అంటున్నారు.

New Update
Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే

Best Fruits : జలుబు చేస్తే తీపి పదార్థాలు తినకూడదని సాధారణంగా చెబుతారు. ముఖ్యంగా పండ్లు తింటే కఫం ఎక్కువగా వస్తుందనే అభిప్రాయం ఉంది. కానీ కొన్ని పండ్లలో ఎక్స్‌పెక్టరెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఈ పండ్లను చలికాలం(Winter Season) లో లేదా జలుబు సమయంలో తీసుకోవచ్చు. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి(Immune Power) ని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం అన్ని పండ్లను తినకూడదని చెబుతున్నారు.

ఆపిల్:

  • ఆపిల్‌(Apple) లో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు(Anti Cancer Properties) కూడా ఉన్నాయి. జలుబును నివారించే శక్తి కూడా దీనికి ఉంది.

అరటిపండు:

  • సాధారణంగా జలుబు(Cold) చేస్తే అరటిపండ్లు తినవద్దని చెబుతుంటారు. కానీ అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది జలుబు, సీజనల్ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. డిప్రెషన్, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

సిట్రస్‌ ఫలాలు:

  • జలుబు చేసినప్పుడు మనం తీసుకోవలసిన ముఖ్యమైన పండ్లలో నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి రోగనిరోధక శక్తి లభిస్తుంది.

పైనాపిల్:

  • పైనాపిల్‌లో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ జలుబు రాకుండా నిరోధిస్తాయి. డీహైడ్రేషన్ ఉన్నవారు పైనాపిల్ పండును మితంగా తీసుకోవచ్చు.

పుచ్చకాయ: 

  • పుచ్చకాయ(Watermelon) లో శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్, వాటర్ కంటెంట్ అధికంగా ఉండటంతో జలుబు తగ్గుతుంది. అంతేకాకుండా అంటువ్యాధులు దరిచేరవని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చుండ్రుతో బాధపడుతున్నారా? కర్పూరంతో ఇలా చేయండి..మేజిక్ చూడండి

Advertisment
Advertisment
తాజా కథనాలు