Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. By Vijaya Nimma 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Cholesterol: జీడిపప్పులో ఐరన్, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ల వంటి శక్తివంతమైన మూలకాలు ఉంటాయి. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. డ్రై ఫ్రూట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది జీడిపప్పే. దీన్ని ఎక్కువగా స్వీట్లతో ఉపయోగిస్తుంటారు. పులావ్ లాంటి వంటకాల్లో జీడిపప్పు పడిందంటే ఆ టెస్టే వేరుగా ఉంటుంది. రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. జీడిపప్పు ప్రయోజనాలు: జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారపు కొవ్వులకు మంచి మూలం. ఇది LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు దూరం: జీడిపప్పు తింనటం వలన జింక్, పొటాషియం, సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో కొలెస్ట్రాల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. జీడిపప్పు HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ స్థాయిని, రక్తపోటును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. వాపును తగ్గిస్తుంది: జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును, వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు హార్ట్‌బీట్‌ని మెయింటెయిన్ చేస్తాయి. ఇందులో ఉండే ఎల్-అర్జినైన్ అనే సమ్మేళనం రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఇది కూడా చదవండి: అరగంటలో బ్రెయిన్ ట్యూమర్‌కి చికిత్స.. ఖర్చు ఎంతంటే? గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #health-care #cholesterol #cashews మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి