Clove Benefits : మన దేశంలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి. వీటిని వంటల్లో, అలాగే ఆయుర్వేద వైద్యం(Ayurvedic Medicine) లో కూడా వాడతారు. వివిధ రకాల దినుసులు వంటలకు ప్రత్యేక రుచిని తీసుకొస్తాయి. అయితే వీటిలోని మెడికల్ ప్రాపర్టీస్ కారణంగా అనారోగ్యాలు సైతం రావు. ముఖ్యంగా లవంగాలతో(Cloves) మంచి హెల్త్ బెనిఫిట్స్(Health Benefits) ఉంటాయి. వీటిలోని సమ్మేళనాలు సమ్మర్ సీజన్‌లో వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ప్రతిరోజూ ఒక లవంగం పలుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
* చర్మ ఆరోగ్యం
వేసవి కాలంలో అధిక వేడి, చెమట కారణంగా వివిధ రకాల చర్మ సమస్యలు రావచ్చు. ఆహారంలో వీటిని చేర్చుకుంటే ఈ సీజన్‌లో ఎదురయ్యే స్కిన్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. లవంగాల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి సమ్మర్‌లో అధిక వేడి వాతావరణం కారణంగా వచ్చే వృద్ధాప్యాన్ని తగ్గిస్తూ, చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
* పోషకాలకు నిలయం
లవంగాల్లో విటమిన్లు, ఖనిజాలు, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు E, C, A, D, రైబోఫ్లావిన్, థయామిన్ వంటి B-కాంప్లెక్స్ విటమిన్లు, ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు సైతం ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. లవంగాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* జీర్ణ ఆరోగ్యం
లవంగాల్లోని సమ్మేళనాలు జీర్ణక్రియను(Digestion) ప్రోత్సహిస్తాయి. ఇవి జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు పేగు లోపలి కదలికలను మెరుగుపరుస్తాయి. లవంగాలు కార్మినేటివ్ ప్రభావంతో గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
* యాంటీఆక్సిడెంట్లు
లవంగాల్లో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. నొప్పి నుంచి ఉపశమనం కల్పించే లక్షణాలు వీటి సొంతం.
* బ్లడ్ షుగర్ కంట్రోల్
రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం లవంగాలకు ఉంటుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చగలవని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇవి మధుమేహానికి చికిత్స చేసే మెడిసిన్ మాత్రం కావు.
* నోటి ఆరోగ్యం
లవంగాలు నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు సూక్ష్మజీవులను నిర్మూలించి, నోటిని శుభ్రం చేస్తాయి. తద్వారా కావిటీస్, గమ్ డిసీజ్ వంటి దంత సమస్యల రిస్క్ తగ్గుతుంది. లవంగం నూనెను డెంటల్ ప్రాబ్లమ్స్‌కు చికిత్సగా, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
* తెలుసుకోవాల్సిన విషయాలు
లవంగాలను మితంగా తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఇవి అందరికీ పడకపోవచ్చు. ఎక్కువ మొత్తంలో లవంగాలు తింటే ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ప్రాబ్లమ్స్, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. లవంగం నూనె వినియోగం పెరిగితే వికారం, వాంతులు, విరేచనాలు, ఇతర జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఇది కొన్నిసార్లు విషపూరితం కూడా కావచ్చు.
Also Read : టేస్ట్ అట్లాస్ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ రుచులు!