International: రోజురోజుకూ కుంగిపోతున్న భూమి..డేంజర్ జోన్‌లో చైనా

అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా భవిష్యత్తులో పెద్ద ప్రమాదంలో పడనుంది. అధిక జనాభా ఆ దేశాన్ని ఎలానో తినేస్తోంది...దానితోడు తాజాగా అక్కడ పట్టణీకణ ఎక్కువైపోయి భూమి కుంగిపోతోంది. దీంతో చైనా ప్రధాన నగరాలు అన్నీ డేంజర్‌లో జోన్‌లో పడిపోయాయి.

New Update
International: రోజురోజుకూ కుంగిపోతున్న భూమి..డేంజర్ జోన్‌లో చైనా

China: బయటకు చాలా పటిష్టంగా కనిపిస్తున్న చైనా అంతర్గతంగా చాలా సమస్యలతో పోరాడుతోంది. ఆర్ధిక ఇబ్బందులు, అధిక జనాభా, వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఆ దేశాన్ని మరో భయం వణికిస్తోంది. ఆదేంటో తెలుసా. అక్కడ భూమి లోపలకు కుంగిపోతోంది. అలా ఎలా అవుతుంది...అది కూడా అక్కడ ఒక్కచోటే అని ఆలోచిస్తున్నారా. దానికి కారణం చైనాలో ఉన్న అధిక జానాభానే కారణం.

పట్టణీకరణే కారణం..

ప్రస్తుతం ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ జనాభా కలిగి దేశం చైనా. ఇది అందరికీ తెలిసిందే. దాంతో పాటూ అక్కడ పట్టణీకరణ కూడా చాలా పెరిగిపోతోంది. చైనాలో జనాలు పల్లెల్లో ఉండడం కన్నా పట్టణాల్లోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతున్నారుట. దీంతో అక్కడ ప్రధాన నగరాలన్నీ క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నాయి. ముఖ్యంగా ఆ దేశ రాజధాని అన్నికంటే ఎక్కువ డేంజర్ జోన్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని తాజాగా ఓ శాటిలైట్ డేటా ప్రచురించింది. చైనాలో ఉన్న నగర జనాభాలో దాదాపు మూడు వంతులలో ఒక వంతు ఈ ప్రయాదంలో చిక్కుకున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాను రాను ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2120 నాటికి చైనాలోని పట్టణ జనాభా 3 రెట్లు పెరుగుతుందని..దాని వలన ఈ భూమి కుంగిపోవడం మరింత ఎక్కువై 5.5 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడుతుందని లెక్కలు చెబుతున్నారు.

డేంజర్‌ జోన్‌లో ప్రధాన నగరాలు..

బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన చేసింది. బీజింగ్, షాంఘైతో సహా మొత్తం 82 నగరాల్లో అధ్యయనం చేసింది. చైనాలో 42 శాతం భూమి లోపలకు వెళిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఏడాదికి 10 మిల్లీ మీటర్ల చొప్పున భూమి కిందికి కుంగిపోతున్నట్లు గుర్తించారు. తీర ప్రాంత నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. నగరాల్లో భారీ నిర్మాణాలు, భవనాలు నిర్మించడం, భూగర్భ జలాలను విపరీతంగా వాడేయడం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, సముద్ర మట్టాలు పెరగడం వల్ల.. భూమి కుంగిపోవడం వేగవంతం అవుతోందని తెలిపారు.

Also Read:International: జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ వల్ల మహిళ మృతి..375 కోట్లు చెల్లించాలని చెప్పిన కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు