Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9.. ప్రారంభంలోనే ఎలిమినేషన్.. ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో తాజాగా రిలీజైంది. ఈ ప్రోమో ప్రకారం.. సీజన్9 ప్రారంభంలోనే ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న వస్తువును హౌస్‌లోకి పంపించమని కోరుతాడు. దానికి నో చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

New Update

ప్రముఖ రియాల్టి షో ‘బిగ్ బాస్’ (Bigg Boss) గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి షో నుంచి ఫుల్ జోష్‌లో అలరించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 సీజన్లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ 8 ఎనిమిది సీజన్లలో దాదాపు 6 సీజన్లకు నాగార్జునే హౌస్ట్‌గా వ్యవహరించి అదరగొట్టేశాడు. మిగిలిన రెండు సీజన్లకు ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని హూస్ట్‌గా వ్యవహరించారు. 

ఈ 8 సీజన్లు దిగ్విషియంగా పూర్తి కాగా.. ఇప్పుడు 9వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 () నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోనో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆడియన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇందులో నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. 

ఎప్పటిలాగే బ్లాక్ షూట్లో స్టైలిష్ గా కనిపించి దుమ్ము దులిపేశారు నాగార్జున. ఈ ప్రోమోలో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 13 మంది కంటెస్టెంట్లను చూపించారు. ఆ తర్వాత సెలబ్రెటీల ఫేస్ లు రివిల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఇందులో నాగార్జున డైలాగ్స్ అందర్నీ అలరించాయి. మరి ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్ విపరీతంగా నచ్చేసింది. 

రెండున్నర నిమిషాలు నిడివితో ఉన్న ఈ ప్రోమో ఆడియన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ఊహకు అందని మార్పులు.. ఊహించిన మలుపులు.. అంటూ డబుల్ హౌస్ తో డబుల్ జోష్ మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9 () అని నాగర్జున తన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున వెళ్లి గోడల్ని బద్దలు కొట్టాడు. అనంతరం బిగ్ బాస్ సెట్ లో ఉన్న రెండు హౌస్ లను చూపించాడు. 

అక్కడే మీ తీరు మారింది ఇల్లు మారింది అంటూ బిగ్ బాస్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సీజన్ ప్రారంభంలోనే ఓ కంటెస్టెంట్ను ఇంటికి పంపించినట్టు తెలుస్తోంది. ప్రోమోలో భాగంగా ఓ కంటెస్టెంట్ తనతో పాటు తెచ్చుకున్న ఒక వస్తువును బిగ్ బాస్ హౌస్ లోకి పంపించమని కోరుతాడు. అందుకు బిగ్ బాస్ మాత్రం నిరాకరిస్తాడు. దీంతో తనతో పాటు ఆ వస్తువు లేకపోతే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనని చెప్పడంతో.. అతనిని వెనక్కి పంపించేస్తారు. 

ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్లు ఎవరన్నది ఒక్కొక్కరిని రివిల్ చేస్తూ హింట్లు ఇచ్చారు. దీంతో సీజన్ ప్రారంభం కాకముందే ఒక కంటెంట్‌ను ఇంటికి పంపించడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రసవత్తరంగా సాగబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Advertisment
తాజా కథనాలు