/rtv/media/media_files/2025/09/07/venkatesh-lover-2025-09-07-11-29-28.jpg)
BIGG BOSS 9 Telugu
BIGG BOSS 9 Telugu: ఇవాళ్టి నుంచి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మొదలుకానుంది. సాయంత్రం 7 గంటలకు షో ప్రారంభం కానుంది. ఈ ఏడాది కూడా కింగ్ నాగార్జుననే షోను హోస్ట్ చేయనున్నారు. ఈ సారి హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటుగా కామనర్ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో అలనాటి బ్యూటీ ఆషా సైని- కూడా ఉన్నారు. ఈమె చండీఘర్ లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. రజినీకాంత్, విజయకాంత్, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభు, కార్తీక్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇందులో వెంకటేష్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే సీన్స్ బాగా నవ్విస్తాయి.
నేరం మీద అరెస్టు
తెలుగుతో పాటు, ఆషా సైని ఇతర భాషల్లో కూడా నటించారు. కన్నడలో సింహాద్రి, మాయా వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. హిందీలో డైసీ (2001), మాన్ (1999) వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆషా సైని సినీ జీవితంలో కొన్ని వివాదాలు కూడా ఎదురయ్యాయి. మార్చి 2008 లో ఆమెను చెన్నైలో నకిలీ వీసా కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు. దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. కానీ ఆమె తాను నిర్దోషినని ప్రకటించింది. దాంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు. 2023లో రానా నాయుడు వెబ్ల సిరీస్ లో కావ్య అనే రోల్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో మళ్లీ కనిపించలేదు. మరి బిగ్ బాస్ 9 సీజన్ ఆమెకు ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి.
Also Read : Suman Setty : డైరెక్టర్ తేజకు గుడి కట్టిన సుమన్ శెట్టికి బిగ్ ఆఫర్..!