/rtv/media/media_files/2025/09/07/teja-2025-09-07-11-02-54.jpg)
Suman Setty: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9) ఈ రోజు 7 గంటలకు ప్రారంభం కానుంది. మరోసారి కింగ్ నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇది ఆయనకు ఏడో సీజన్. ఈ సీజన్ థీమ్ రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఈ సారి హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటుగా కామనర్ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో సుమన్ శెట్టి కూడా ఉన్నారని తెలుస్తోంది. 100కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సుమన్ శెట్టిది వైజాగ్.
Also Read : Trump-Jinping: చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం..జిన్ పింగ్ తో భేటీకి రెడీ అవుతున్న ట్రంప్
సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ(Director Teja) ఇతనికి జయం చిత్రం ద్వారా అవకాశం ఇచ్చారు. దీంతో మనోడికి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. జయం సినిమాకు ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. జయం తర్వాత ఆ తర్వాత బెండు అప్పారావ్ ఆర్ఎంపీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యజ్ఞం, సంబరం, రణం, సంక్రాంతి, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, 7/జి బృందావన్ కాలనీ, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ తదితర సినిమాల్లో నటించాడు.
తేజ సలహా మేరకు
జయం సినిమా తరువాత డైరెక్టర్ తేజ సలహా మేరకు ఇల్లు కట్టుకున్నా సుమన్ శెట్టి తన ఇంట్లో డైరెక్టర్ తేజ కోసం ఓ రూమ్ కట్టాడట. అందులో తేజ ఫోటో మాత్రమే ఉంటుంది. దానిని ఓ గుడిలాగా భావిస్తాడట. రోజ క్లీన్ చేసి ఉంచుతాడట సుమన్ శెట్టి. ఈ విషయాన్ని తేజ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా ఆఫర్లు తగ్గిన సుమన్ శెట్టికి బిగ్ బాస్ రూపంలో బంపరాఫర్ వచ్చింది. బిగ్ బాస్ షోలో సత్తా చాటి మళ్లీ నటుడిగా బిజీ అవుదామనుకుంటున్నాడు సుమన్ శెట్టి. మరి ఈ ఆఫర్ ను సుమన్ శెట్టి ఎలా ఉపయోగించుకుంటాడు అనేది చూడాలి.
Also Read : Lunar Eclipse : నేడే చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయకండి..ఈ రాశుల వారు జాగ్రత్త!