/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-1-3.jpg)
Duvvada Srinivas Family Controversy: ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ విషయం గురించి దువ్వాడ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిప్యూటీ సీఎం పవన్ కు (Pawan Kalyan) తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని పవన్ కు విన్నవించేందుకు ఆమె యత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే మూడో రోజు ఆయన భార్య, బిడ్డ ఆందోళన కొనసాగిస్తున్నారు. తాము ఇక్కడ నుంచి కదిలేది లేదని దువ్వాడ సతీమణి, కుమార్తె హైందవి పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే దువ్వాడ, వాణి పరస్పరం ఒకరిమీద ఒకరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఫిర్యాదుతో ఆయన భార్య వాణి, కుమార్తె హైందవి తో పాటు మరో ముగ్గురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ వాణి వాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్సీ శ్రీనివాస్, అతని సోదరుడిపై టెక్కలి పోలీసులు కేసు ఫైల్ చేశారు.
విడాకుల నోటీసు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సిద్ధం అవుతుండగా.. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి తేల్చి చెబుతోంది.
Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు…ఇక నుంచి ఆ పేరుతో!