Dubai Rains: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా?

కుంభవృష్టి, మెరుపు వరదలతో చిగురుటాకులా వణికిపోయింది దుబాయ్‌. ఎప్పుడూ పెద్దగా వర్షాలు అలవాటు లేని నగరం ఒక్కసారిగా కుండపోత వాన కురిసేసరికి అల్లకల్లోలం అయిపోయింది. అయితే దీనికి కారణం ఏంటి? ఎందుకు దుబాయ్‌లో అంతలా వర్షం కురిసింది?

New Update
Dubai Rains: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా?

Did Cloud Seeding Cause Rains in Dubai?: ఒక్కరోజులోనే దుబాయ్‌లో ఏడాదిన్నర వర్షపాతం నమోదవడం పెద్ద వింతగా మారింది. చాలా తక్కువ వర్షాలు పడే ఏడారి దేశంలో అంతలా వర్షం పడడంతో అక్కడ అంతా అతలాకుతలం అయిపోయింది. భీభత్సం జరిగింది. అన్నీ బంద్ అయిపోయాయి. మొత్తం నగరం అంతా నీటిలో మునిగిపోయింది. ఎక్కడివక్కడ ఆగిపోయాయి. జనజీవనం స్థంభించి పోయింది. విమానాలు రద్దయి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాస్త పరిస్థితి సద్దుమణిగినా..దుబాయ్‌లో ఇంతటి బీభత్సానికి (Dubai Rains) కారణమేంటి? ఎడారి దేశంలో ఎందుకిలా జరిగింది? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

తీవ్ర ఉష్ణోగ్రతలు..ఎడారి మయం..
మామూలుగా అరబ్ దేశాలు ఎడారి మయంగా ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ దేశాల్లో పచ్చదనం చాలా తక్కువ. ఎందుకంటే వర్షాఉ పెద్దగా పడవు కాబట్టి. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. దీనికి కారణం గల్ఫ్ కంట్రీస్ అనుసరిస్తున్న క్లౌడ్ సీడింగ్ విధానం.

క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి...

క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమంగా వర్షాలు పడేలా చేయడం. అరబ్ దేశాల్లో సహజంగా వర్షాలు తక్కువ పడతాయి. కాబట్టి ఇక్కడి నీటి కొరతను తీర్చేందుకు కృత్రిమ వర్సాలను కురిపిస్తారు. విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి, ఆ మేఘాలు కరిగి వర్షంలా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. అయితే వీటిని ఎక్కువగా చేస్తే ఇలానే కుంభవృష్టి వర్సాలు పడతాయి. దుబాయ్‌లో రెండ్రోజుల్లో ఏడుసార్లు క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలు ప్రయాణించాయి. ఇదే బెడిసి కొట్టిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనం వినియోగిస్తారు. కానీ యూఏఈ హానికారక రసాయనాలకు దూరంగా ఉంటూ సాధారణ లవణాలనే ఉపయోగిస్తోంది. టైటానియం ఆక్సైడ్‌ పూత కలిగిన ఉప్పుతో..నాన్‌ మెటీరియల్‌తో క్లౌడ్‌ సీడింగ్‌ చేస్తోంది.

అయితే కృత్రిమ వర్షాలతో తాత్కాలిక ప్రయోజనాలున్నప్పటికీ..కొన్నిసార్లు ఇలా ఆకస్మిక వరదలకు కూడా కారణమవుతున్నాయి. రెండు మూడేళ్ల నుంచి అరబ్ దేశాల్లో తరచూ భారీ వర్షాలు పడుతుననాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దుబాయ్‌లో కురిసి కుండపోతకు, మెరుపు వరదలకు కూడా కారణం ఈ క్లౌడ్ సీడింగేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒకరకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనంటున్నారు. ఒకచోట ఇలా అత్యధిక వర్షపాతాలు కురిపిస్తే, అది మరో చోట అనావృష్టికి దారి తీసి కరవు ఏర్పడుతుందిని చెబుతున్నారు. ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ జోక్యం తగదని సూచిస్తున్నారు.

కోలుకుంటున్న దుబాయ్..
ఇక మెరుపు వరదల నుంచి దుబాయ్‌ నెమ్మదిగా కోలుకుంటోంది. స్కూల్స్‌, ఆఫీసులకు రేపటివరకు సెలవులు ప్రకటించారు. వరద నీరు పూర్తిగా తగ్గితే కానీ రోడ్ల మీద ప్రయాణాలు చేయలేమని భావిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా స్తబద్ఉగా అయిపోయింది. 100కు పైగా విమానాలు రాకపోకలు బంద్‌ అయ్యాయి. ప్రయాణికులు అందరూ ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు పడుతున్నారు. పరిస్థితి చక్కబడి విమానాలు తిరిగేంతవరకు తిప్పలు తప్పవు.

publive-image Dubai Rains Dubai Rains

Also Read:West Bengal: శ్రీరామ నవమి ఉత్సవాల్లో బ్లాస్ట్..ఒకరికి తీవ్ర గాయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు