Dubai Multiple Entry Visa For Indians: సాధారణంగా పలు దేశాలు.. తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇతర దేశాలకు పలు ఆఫర్లు ఇస్తుంటాయి. వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చి తమ పర్యటక ప్రదేశాలకు టూరిస్టూలు ఎక్కువగా సందర్శించేలా ప్రణాళికలు వేస్తాయి. తాజాగా భారతీయుల కోసం దుబాయ్ (Dubai) ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందుకోసం మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాను ప్రవేశపెట్టింది. ఇలాంటి సౌకర్యాన్నే గల్ఫ్ దేశాలకు కూడా ఏర్పాటు చేసింది. దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకామనీ అండ్ టూరిజం (డీఈటీ)ను ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ పీటీఐ (PET) తెలిపింది.
Also Read: నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!
ఐదేళ్లలో ఎన్నిసార్లైనా వెళ్లిరావొచ్చు
గతేడాది దుబాయ్‌ను దాదాపు 2.46 మిలియన్ల మంది ఇండియన్స్ సందర్శించారు. కరోనా ముందు ఉన్న పరిస్థుతలతో పోలిస్తే.. ఇది 25 శాతం ఎక్కువ. 2019లో కేవలం 1.97 మిలియన్ల భారతీయ పర్యాటకులు దుబాయ్‌కి వచ్చారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన సరికొత్త విధానం ద్వారా భారతీయులు (Indians) పర్యాటక వీసాతో దుబాయ్‌కు ఐదేళ్ల కాలంలో పలుమార్లు వెళ్లి రావచ్చు. ఒకసారి వెళ్తే 90 రోజుల పాటు అక్కడ ఉండి రావొచ్చు. అయితే ఒక ఏడాదిలో మొత్తం 180 రోజులకు మించకుండా ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్‌ను కేవలం రెండు నుంచి ఐదు పనిరోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిబంధనలు తప్పనిసరి
మరో విషయం ఏంటంటే ఈ వీసాకు (Visa) అర్హులైన వారు కచ్చితంగా కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది. గత ఆరు నెలల్లో బ్యాంకు ఖాతాల్లో 4 వేల డాలర్లు లేదా అంతకు సమానమైన విదేశీమారక ద్రవ్యం ఉండాలి. అలాగే యూఏఈలో చెల్లుబాటు అయ్యేలా ఆరోగ్య బీమా తప్పనిసరి. దుబాయ్‌లో సుస్థిర ఆర్థిక సహకారం కొనసాగించేందుకు.. వాణిజ్య, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు డీఈటీ తెలిపింది.
Also Read: ఓయూకు రూ.5కోట్లు విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి!