Hyderabad : ఓయూకు రూ.5కోట్లు విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి!

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థి గొప్ప మనసు చాటుకున్నారు. ఓయూలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్‌ నిర్మాణానికి గోపాల్‌ టీకే కృష్ణ అనే ఓల్డ్ స్టూడెంట్ రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. గోపాల్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

New Update
Hyderabad : ఓయూకు రూ.5కోట్లు విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి!

Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) లో చదివిన ఓ పూర్వ విద్యార్థి(Old Student) గొప్ప మనసు చాటుకున్నారు. తనకు విద్యా బుద్దులు నేర్పి గొప్పవాడిని చేసిన కళాశాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసేందుకు తనవంతు ఆర్థిక సాయం అందించారు. ఓయూలోని ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆధునిక తరగతి గదుల కాంప్లెక్స్‌ నిర్మాణానికి గోపాల్‌ టీకే కృష్ణ(Gopal TK Krishna) అనే ఓల్డ్ స్టూడెంట్ రూ.5కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

1968లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి..
ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో 1968లో గోపాల్ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం అమెరికా(America) లో వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను చదువుకున్న కాలేజీకి ఏందో ఒక మంంచి పని చేయాలను సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Kerala: రోడ్డుకు పెళ్లి.. అతిథులకు అదిరిపోయే విందు!

ఇందులో భాగంగానే తన వంతు సాయం అందించిన కృష్ణ మాట్లాడుతూ.. సెమినార్‌ హాల్‌కు ప్రొ.వి.ఎం.గాడ్గిల్‌ ఆడిటోరియం(Pro. V. M. Gadgil Auditorium) గా, కమ్యూనిటీహాల్‌కు ప్రొ.అబిద్‌ అలీ(Pro. Abid Ali) పేర్లను పెట్టాలని కోరారు. గొప్ప మనసు చాటుకున్న కృష్ణను వీసీ ప్రొ.రవీందర్‌ అభినందించి సన్మానించారు. రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.చంద్రశేఖర్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఓఎస్డీ ప్రొ.రెడ్యానాయక్‌ లు గోపాల్ చేసి పని ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు