Ashwini Vaishnaw : దూరపు ప్రయాణాలు(Long Journey) చేసేందుకు చాలామంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కానీ రైలు ప్రమాదాలు(Train Accident) కూడా చాలసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు సాంకేతిక లోపంతో ప్రమాదాలు జరిగితే.. మరికొన్నిసార్లు డ్రైవర్ నిర్లక్ష్యంతో కూడా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అయితే గత ఏడాది విజయనగరం జిల్లా కంటకాపల్లి జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు.
Also Read : విద్యార్ధులకు ఇస్రో బంపర్ ఆఫర్…అస్సలు మిస్ అవ్వద్దు
14 మంది మృతి
లోక్‌పైలెట్(Loco Pilot), సహాయ లోకోపైలెట్‌లు తమ సెల్‌ఫోన్(Cell Phone) లో క్రికెట్(Cricket) చూస్తూ రైలు నడపడంతోనే రెండు రైళ్లు ఢీకొన్నాయని తెలిపారు. రైల్వేశాఖకి సంబంధించి కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతున్న క్రమంలో కంటకాపల్లిలో జరిగిన రైలు ప్రమాదం గురించి ఆయన మాట్లాడారు. 2023లో అక్టోబర్ 29న కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం వేచివున్న రాయ్‌గడ ప్యాసింజర్ ట్రైన్(Rayagada Passenger Train) ను వెనుక నుంచి విశాఖ పలాస ప్యాసింజర్ రైలు(Visakha Palasa Passenger Train) ఢీకొందని చెప్పారు. ఈ దుర్ఘటనలో 14 మృతి చెందగా.. దాదాపు 50 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు.
నిత్యం పర్యవేక్షించే వ్యవస్థ
ఈ ప్రమాదంలో పలాస ప్యాసింజర్ ట్రైన్‌లోని ఇద్దరు లోకో పైలట్లు రైలు నడుపుతుండగానే.. మొబైల్‌ఫోన్‌లో క్రికెట్ చూస్తూ ఉండిపోయారని.. దీనివల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇక నుంంచి విధుల్లో ఉన్న పైలట్ల పట్ల నిత్యం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకొచ్చామని మంత్రి అశ్వనీ వైష్ణవ్(Ashwini Vaishnaw) పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తరువాతి రోజే విచారణ కోసం కమిటీ వేశామని.. ఇందుకు సంబంధించి నివేదిక రాకముందే ప్రమాదానికి కారణమైన లోకోపైలట్, సహాయ లోకోపైలట్‌లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read : ఆ నలుగురు సిట్టింగ్స్ ఔట్..ఈ స్థానం నుంచి బరిలోకి ‘చిన్నమ్మ’ కూతురు..!