Summer Care : వేసవి కాలం(Summer) వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోతుంటుంది. చమటకాయలతో పాటు అనేక రకాల చర్మ సమస్యలు(Skin Diseases) వస్తుంటాయి. అందుకే కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఆ డ్రింక్స్(Summer Drinks) ఎంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అలోవెరా జ్యూస్:
- కలబంద(Aloe Vera) వడదెబ్బకు మాత్రమే కాదు పొడి చర్మానికి కూడా గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.. కలబంద రసంలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి, శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
దోసకాయ నీరు:
- వేసవిలో ప్రతిరోజూ పుదీనా కలిపిన దోసకాయ నీరు(Cucumber Water) తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. దోసకాయ హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుదీనా(Mint) రిఫ్రెష్‌నెస్ ఇస్తుంది. ఇవి చర్మాన్ని తేమగా మారుస్తాయి. అంతేకాకుండా శరీరం లోపలి నుంచి శుభ్రపరుస్తాయి.
కొబ్బరి నీరు:
- మెరిసే, హైడ్రేటెడ్, మృదువైన చర్మాన్ని పొందడానికి కొబ్బరి నీరు కూడా ఒక గొప్ప ఎంపిక. ఇందులో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
వేడి నిమ్మ నీరు:
- వేడి నీరు(Hot Water) జీవక్రియను వేగవంతం చేయడానికి, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో చర్మానికి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. వేడినీరు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గ్రీన్ టీ:
- గ్రీన్ టీ(Green Tea) యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ అని చెబుతారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది చర్మంలో పీహెచ్ స్థాయిని పెంచడమే కాకుండా ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
వైద్యుల సలహా:
- ఎండా కాలంలో వడదెబ్బ తగలకుండా, చర్మం పొడిబారకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మ సమస్యలు ఉండవని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ నూనె రాస్తే ఎలాంటి కాళ్ల పగుళ్లు అయినా పోవాల్సిందే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.