Double Isamart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే?

'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.

Double Isamart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేస్తుంది, ఎప్పుడంటే?
New Update

Double ISmart Teaser Update : టాలీవుడ్(Tollywood) సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'డబుల్ ఇస్మార్ట్'(Double ISmart) కూడా ఒకటి. 'ఇస్మార్ట్ శంకర్' కి ఇది సీక్వేల్ కావడం, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే మూవీ టీమ్ ముంబై(Mumbai) లో లీడ్ యాక్టర్స్ పై కీలక సన్నివేశాలను షూట్ చేసారు. కాగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఎక్సయిటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

Also Read : చిరంజీవికి ఫోన్ చేసి మరీ ‘సారీ’ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

'డబుల్ ఇస్మార్ట్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. రామ్(Ram) ఫ్యాన్స్ తో పాటూ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ టీజర్ ని రెడీ చేయిస్తున్నారట పూరీ జగన్నాథ్. త్వరలోనే టీజర్ రిలిజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో

పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. జూలై లో ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

#ram-pothineni #tollywood #double-ismart-teaser #mumbai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe