Taliban Rules On Women: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. అక్కడ మహిళల మీద తమ ప్రతాపం చూపిస్తూ వారికి నరకాన్ని చూపిస్తున్నారు. మహిళల చదువు, ఉద్యోగాలు, మేకప్‌ల దగ్గరి నుంచి అసలు వారిని ఇళ్ల నుంచి బయటికి రానీయకపోవడం, పరాయి పురుషుడిని కనీసం కన్నెత్తి అయినా చూడకుండా కఠిన చట్టాలను తీసుకువస్తున్నారు. వాటిని పాటించకపోతే.. బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే కఠిన శిక్షలను కూడా విధిస్తున్నారు. ఇక్కడ షరియా చట్టం పేరుతో మహిళల అణిచివేత రోజురోజుకూ పెరిగిపోతోంది.
తాజాగా తాలిబన్లు మహిళలకు మరో రెండు కఠిన చట్టాలను అమలు చేశారు. మహిళలు బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై సరికొత్త ఆంక్షలను విధించారు. ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదం కూడా తెలిపింది. మహిళల చెడు ప్రవర్తనను అరికట్టడం కోసం ఈ కొత్త నిబంధనలు పెట్టామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖంతో పాటు మొత్తం శరీరాన్ని కప్పుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఇది ఎప్పటినుంచో ముస్లిమ్ సమాజంలో ఉంది. కానీ ఆప్ఘాన్‌లో ఇప్పుడు ఈ రూల్‌ను మరింత తీవ్రతరం చేశారు. వీటిని పాటించకపోతే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని హెచ్చరించారు.
అంతేకాదు అక్కడి స్త్రీలు వేసుకునే బట్టలపైనా ఆంక్షలు విధించారు. మహిళలు వేసుకునే బట్టలు సన్నగా, బిగుతుగా లేదా పొట్టిగా ఉండకూడదని ఆ చట్టంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పురుషులను రెచ్చగొట్టకుండా ఉండటానికి ముఖాన్ని కప్పి ఉంచడం అవసరమని చెబుతున్నారు. దీంతో పాటూ ఆడారు బహిరంగంగా మాట్లాడటం, పాటలు పాడటాన్ని కూడా నిషేధించారు. పాటలే కాకుండా, కవితలు చదవడం, గట్టిగా మాట్లాడటం కూడా ఈ దేశంలో ఇప్పుడు నిషిద్ధం. ఏవలం కట్టుకున్న భర్తకు, ఇంట్లో కన్నవారికి మాత్రమే ఆడవారు సొంతం అనేలా చట్టాలను కఠినతరం చేశారు.
Also Read: Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా