Afghanistan: ఆఫ్ఘాన్‌లో మహిళలపై మళ్ళీ ఆంక్షలు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఆఫ్ఘాన్ మహిళల మీద ఆంక్షలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అక్కడ తాలిబన్లు స్త్రీల మీద తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ఆంక్షలు పెట్టిన తాలిబన్లు...తాజాగా మహిళలు పాటలు పాడొద్దు, మగవారిని చూడొద్దు అంటూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు. By Manogna alamuru 27 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Taliban Rules On Women: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. అక్కడ మహిళల మీద తమ ప్రతాపం చూపిస్తూ వారికి నరకాన్ని చూపిస్తున్నారు. మహిళల చదువు, ఉద్యోగాలు, మేకప్‌ల దగ్గరి నుంచి అసలు వారిని ఇళ్ల నుంచి బయటికి రానీయకపోవడం, పరాయి పురుషుడిని కనీసం కన్నెత్తి అయినా చూడకుండా కఠిన చట్టాలను తీసుకువస్తున్నారు. వాటిని పాటించకపోతే.. బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే కఠిన శిక్షలను కూడా విధిస్తున్నారు. ఇక్కడ షరియా చట్టం పేరుతో మహిళల అణిచివేత రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా తాలిబన్లు మహిళలకు మరో రెండు కఠిన చట్టాలను అమలు చేశారు. మహిళలు బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై సరికొత్త ఆంక్షలను విధించారు. ఈ చట్టాలకు తాలిబాన్ అగ్రనేత హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదం కూడా తెలిపింది. మహిళల చెడు ప్రవర్తనను అరికట్టడం కోసం ఈ కొత్త నిబంధనలు పెట్టామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ కొత్త చట్టాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖంతో పాటు మొత్తం శరీరాన్ని కప్పుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఇది ఎప్పటినుంచో ముస్లిమ్ సమాజంలో ఉంది. కానీ ఆప్ఘాన్‌లో ఇప్పుడు ఈ రూల్‌ను మరింత తీవ్రతరం చేశారు. వీటిని పాటించకపోతే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు అక్కడి స్త్రీలు వేసుకునే బట్టలపైనా ఆంక్షలు విధించారు. మహిళలు వేసుకునే బట్టలు సన్నగా, బిగుతుగా లేదా పొట్టిగా ఉండకూడదని ఆ చట్టంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పురుషులను రెచ్చగొట్టకుండా ఉండటానికి ముఖాన్ని కప్పి ఉంచడం అవసరమని చెబుతున్నారు. దీంతో పాటూ ఆడారు బహిరంగంగా మాట్లాడటం, పాటలు పాడటాన్ని కూడా నిషేధించారు. పాటలే కాకుండా, కవితలు చదవడం, గట్టిగా మాట్లాడటం కూడా ఈ దేశంలో ఇప్పుడు నిషిద్ధం. ఏవలం కట్టుకున్న భర్తకు, ఇంట్లో కన్నవారికి మాత్రమే ఆడవారు సొంతం అనేలా చట్టాలను కఠినతరం చేశారు. Also Read: Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా #women #afghanistan #rules #taliban మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి