Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్‌ ట్రంప్‌ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్‌ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్‌.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్‌ ఐలాండ్స్‌లో గెలిచారు.

New Update
Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్‌

Donald Trump Wins South Carolina Republican Primary: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్‌కు (Joe Biden) పోటీగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డోనాల్డ్‌ ట్రంప్‌ (Trump) దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్‌ విజయం సాధించారు. మరో విషయం ఏంటంటే నిక్కీ హేలీకి (Nikki Haley) తన సొంత రాష్ట్రంలో కూడా ఓటమి తప్పలేదు. ఇప్పటికే ట్రంప్‌.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్‌ ఐలాండ్స్‌లో గెలిచారు.

Also Read: అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..!

మళ్లీ రేసులో ఉంటా

అయితే ఇప్పటికీ కూడా నిక్కీ హేలీ.. పోటి నుంచి తప్పుకోవడానికి అంగీకరించడం లేదు. మార్చి 5న కూడా పలు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా తాను పాల్గొంటానని నిక్కీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య మరోసారి గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్‌ తన మద్దతుదారును ఉద్దేశించి మాట్లాడుతూ. రిపబ్లికన్ పార్టీ.. ఇప్పుడున్నట్లుగా గతంలో ఐక్యంగా లేదని అన్నారు.

నిక్కీ కన్నా ట్రంప్ బెస్ట్‌

ఇదిలాఉండగా.. చాలాకాలం నుంచి దక్షిణ కరోలినాలో రిప్లబికన్‌ పార్టీకి మంచి పట్టుంది. ఈ రాష్ట్రానికి గతంలో నిక్కీ హేలీ గవర్నర్‌గా కూడా పనిచేశారు. అయినాకూడా తాజాగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలవ్వడం గమనార్హం. ఆ రాష్ట్రంలో గవర్నర్‌గా ఆమె మంచి సేవలు చేసినప్పటికీ కూడా జాతీయ స్థాయి వ్యవహారాలను.. ట్రంప్‌ (Donald Trump) కంటే ఆమె మెరుగ్గా నిర్వహించలేరని.. కొంతమంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నిక్కీ హేలీ ఓడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా ప్రజలు ఈసారి డెమోక్రాట్లకు మద్దతిస్తారా లేదా రిపబ్లికన్లకు మద్దతిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Also Read: ‘పెళ్లి చేస్తేనే చదువుకుంటా..’ ఆమెకు 12, అతనికి 13.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు