Delhi: అసదుద్దీన్ ఇంటిపై దాడి

ఢిల్లీలోని తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లతో కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ ఫిర్యాదు చేశారు.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Delhi: అసదుద్దీన్ ఇంటిపై దాడి
New Update

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన.. ఢిల్లీలోని తన ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఒవైసీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాడిలో తన ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ పోలీసులకు తెలిపారు. దుండగుల రాళ్ల దాడిలో ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన ఇంటిపై రాళ్ల దాడి..ఇది తొలిసారి కాదని.. నాలుగోసారి ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు మూడుసార్లు దాడి చేశారు. ఇలాంటి దాడులు 2014 నుంచి ఇప్పటివరకు తన ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగిందని ఒవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఒవైసీ పోలీసులను కోరారు. అయితే.. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి వేగంగా దర్యాప్తు చేశారు. అయితే అక్కడే సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంతలోనే ఢిల్లీలోని తన నివాసంపై రాళ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇలా నాల్గవ సారి జరగడంతో ఎంఐఎం అధినేత సీరియస్‌ అయ్యారు. తన ఇంటిని కొందరు టార్గెట్‌ చేసి మాటి మాటికి ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:Telangana: తెలంగాణ సీఎం రేవంత్ వరంగల్ టూర్ వాయిదా

#telangana #delhi #house #attck #aimim-mla-asaduddin-owaisi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe