Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్‌కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌పై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు.

New Update
Rajasingh: ఇళ్ల గురించి కేటీఆర్‌కు తెలుసా.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్‌పై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ ఆ సమయంలో ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు. అసలు కేటీఆర్‌ వద్ద లబ్ది దారులకు సంబంధించిన లీస్ట్‌ ఉందా అన్నారు. మంత్రి కేటీఆర్‌ ఒక సారి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు సంబంధించిన డేటా గురించి తెలుసుకోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2.16 లక్షల ఇళ్లు నిర్మించినట్లు గూగుల్‌ తెలుపుతోందన్న ఆయన.. కానీ కేసీఆర్‌ సర్కార్‌ లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఇళ్లు కావాలంటున్నారన్న ఆయన.. ప్రభుత్వం డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తుందో, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తుందో తమకు అనవసరమని, ప్రభుత్వం మాత్రం కచ్చితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని గోషా మహల్‌ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇళ్లకు రేట్లు కట్టలేక, గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పూరిగిడిసెలో ఉంటున్న పేదలు పాములు, తేల్లు కుట్టి మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. నిరు పేదలకు ఇళ్లు ఇవ్వలేని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మాట్లాడుతోందని రాజాసింగ్‌ విమర్శించారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి ఇళ్లు నిర్మించలేదని కేటీఆర్‌ ఇతరుల గురించి తప్పుగా చెప్పడం అలవాటైందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 15.50 లక్షల సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లో 7.80 లక్షల ఇళ్లు, మహారాష్ట్రలో 11.70 లక్షలు, గుజరాత్‌లో 6.40 లక్షలు, హర్యానాలో 2.65 లక్షలు, అస్సాంలో 1.55 లక్షల ఇళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. కానీ కేటీఆర్‌ ఇళ్ల నిర్మాణం విషయంలో ఒక్కో చోట ఒక్క సంఖ్య చెబుతున్నారని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు