Delhi: ఎయిర్‌ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్‌ చేసి కాపాడిన వైద్యురాలు!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్‌ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్‌ అలసిపోకుండా సీపీఆర్‌ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు.

Delhi: ఎయిర్‌ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్‌ చేసి కాపాడిన వైద్యురాలు!
New Update

Delhi: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్‌ చేసి కాపాడారు. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన ఆయనను వైద్యురాలు కేవలం సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్‌ చేసి ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

60 ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫుడ్‌ కోర్టు ప్రాంతంలో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిన చోట జనం గుమిగూడారు. వెంటనే స్పందించిన మహిళా డాక్టర్‌.. సీపీఆర్ నిర్వహించి నిమిషాల వ్యవధిలోనే ఆ పెద్దయాన్ని కాపాడారు. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్‌ అలసిపోకుండా సీపీఆర్‌ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు వీడియో చిత్రీకరించారు. ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించారంటూ ఆ మహిళా డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. భారతీయ వైద్యులంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also read: తెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ వర్షాలు

#video #viral #doctor #heartattack #airport #cpr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe