Delhi: ఎయిర్ పోర్ట్ లో గుండెపోటుతో కుప్పకూలిన వృద్దుడు..సీపీఆర్ చేసి కాపాడిన వైద్యురాలు!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఓ వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు.ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్ అలసిపోకుండా సీపీఆర్ చేస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని వీడియో చిత్రీకరించారు.