A+ Blood Group : చికెన్(Chicken) అంటే చాలా మంది లొట్టలేసుకుని మరీ తింటుంటారు. కానీ తరచుగా చికెన్ తినడం కూడా ప్రమాదకరమే. కొన్నిమీడియా కథనాల ప్రకారం ప్రతిఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ ను బట్టి వారి ఆహారాన్ని ఎంచుకోవాలి.బ్లడ్ గ్రూప్ ఆధారంగా తీసుకున్న ఆహారం శరీరం వేగంగా జీర్ణం అవుతుందట. ఇది చికెన్ కూడా వర్తిస్తుంది. చికెన్, మటన్ అందరూ జీర్ణించుకోలేరు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..కొన్ని బ్లడ్ గ్రూపులో విషయంలో చికెన్ తరుచుగా తీసుకవోడం చాలా వరకు తగ్గించాలి. లేదంటే రకరకాల శారీరక సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
మన ఆహారం నేరుగా మన రక్తానికి సంబంధించింది. ఏ బ్లడ్ గ్రూపులకు ఏ ఆహారం సరిపోతుందో..దేనికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. Aబ్లడ్ గ్రూపు కలిగి ఉన్నవారి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారు ఆహారంపై ఎక్కువగా శ్రద్ద తీసుకోవాలి. అలాంటి వారు మాంసాహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. నివేదికల ప్రకారం, వారి శరీరాలు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేవు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చికెన్, మటన్ తక్కువగా తినాలి. వాటికి బదులుగా పచ్చి కూరగాయలు కాకుండా..ఆహరంలో సీఫుడ్,వివిధ రకాల పప్పులను చేర్చుకోవాలి.
వీరే కాకుండా B బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఈ విషయంలో అత్యంత అదృష్టవంతులేనని చెప్పాలి. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ఆకు కూరలు, పండ్లు, చేపలు, మటన్, చికెన్ వంటివి అన్నీ తినవచ్చు. మిగిలిన రెండు బ్లడ్ గ్రూపులు కూడా చికెన్, మటన్ పుష్కలంగా తీసుకోవచ్చు. అంటే చికెన్ మటన్, ఏబి, ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లు బ్యాలెన్స్ చేసుకుని తినాలి. ఆహారం ఏదైనా సరే కొన్ని దుష్ప్రభావాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ నివేదికలను బట్టి చూస్తూ ఏదైనా ఆహారం గురించి తెలసుకోవడానికి ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్…ఈ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు అప్లయ్ చేశారా?