Tooth Paste: మన దంతాలు పసుపు మరకలు లేకుండా తెల్లగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్లోరైడ్ పేస్ట్ ఉపయోగించవచ్చా లేదా అనే రెండు అభిప్రాయాలు ఉన్నాయి. వాటిలో ఏది సరైనది, ఏ రకమైన పేస్ట్ ఉపయోగించడం మంచిది అనేవి తెలియక సతమతం అవుతుంటాం. రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం మంచిదని మనందరికీ తెలుసు. కానీ ఏ రకమైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవాలో స్పష్టంగా తెలియదు. టూత్ పేస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దంతాలకు ఫ్లోరైడ్:
- మన దంతాలు, ఎముకలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ఖనిజాలలో ఫ్లోరైడ్ ఒకటి. దంతాలు దృఢంగా మరియు తెల్లగా ఉండేందుకు ఇది అవసరమైన ముఖ్యమైన ఖనిజం. నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. దాని పరిమాణాన్ని బట్టి అది మన దంతాలకు సరిపోతుందా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు. మనంవాడే చాలా టూత్ పేస్టులలో ఈ ఫ్లోరైడ్ రసాయనం ఉంటుంది. సరైన మొత్తంలో ఫ్లోరైడ్ జోడించిన టూత్‌పేస్టులను ఉపయోగించినప్పుడు దంతాలు సురక్షితంగా ఉంటాయి. ఈ ఫ్లోరైడ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.
ఫ్లోరైడ్ దంత క్షయాన్ని నివారిస్తుందా?
- మీరు ఉపయోగించే టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ ఉంటే అది మీ దంతాలను పాడవకుండా ఉంచుతుంది. దంతాలు బలంగా లేనప్పుడు ఎనామెల్ అనేది యాసిడ్ నిరోధకతను కోల్పోతుంది. గట్టి వస్తువులను కొరికే సమయంలో అరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనిని డీమినరలైజేషన్ అంటారు. కానీ ఫ్లోరైడ్ టూత్ పేస్టులను ఉపయోగించడం వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ని ఉపయోగించి పళ్ళు తోముకోవడంతో పెద్దలు మరియు పిల్లలలో దంత క్షయాన్ని నివారించవచ్చు. ఫ్లోరైడ్ దంతాల ఉపరితలంపై బలహీనమైన మచ్చలు, దంతాలలో చికాకును సరిచేయడానికి పనిచేస్తుంది.
పిల్లలు క్రమంతప్పకుండా బ్రష్ చేయాలి:
- పిల్లల దంతాలను ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడానికి వారు రోజూ క్రమం తప్పకుండా పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. అలాగే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బఠానీల పరిమాణంలో ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో మాత్రమే పళ్ళు తోముకోవాలి.
నీటిలో ఫ్లోరైడ్:
- మనం తాగే నీటిలో ఫ్లోరైడ్ అనే ఖనిజం ఉంటుంది. ఇది మన ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం.
ఫ్లోరైడ్ ఎక్కువైతే:
- మీ ప్రాంతంలోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సహజంగా ఉంటే ఆ నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడతాయి. పరిమాణం మించిపోయినప్పుడు వెన్నెముక ప్రాంతంలోని ఎముకలు బలహీనంగా మారుతాయి. వెన్నెముక నిటారుగా కాకుండా వంగి ఉంటుంది.
ఇది కూడా చదవండి: జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.