Ayodhya row:రామాయణం తీయాలంటే...రాముడిని చూపించాలంటే...బాపు తర్వాతే

తెలుగు సినిమాల్లో రాముడిని తమ నరనరాన జీర్ణించుకున్నవారిలో బాపు-రమణలు ఒకరు. తాము ఏ సినిమా తీసినా రామ ఇతివృత్తాన్ని కథాంశంగా ఎంచుకుని సినిమాలు తీశారు. మనుషులు రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తెలుగు తెరను రామమయం చేశారు.

New Update
Ayodhya row:రామాయణం తీయాలంటే...రాముడిని చూపించాలంటే...బాపు తర్వాతే

Telugu Movies:బాపు అంటే రామాయణం...రామాయణం అంటే బాపు..తెలుగు వారికి ఎవరైనా ఇది తెలియక మానదు. బొమ్మలు, సినిమా...అది ఇతిహాసమా, పౌరాణికమా లేదా సోషల్ మూవీనా..అన్న బేధం ఉండదు. ఎలాంటి బొమ్మ గీసినా, ఏ సినిమా తీసినా అందులో రామాయణం కనిపించాల్సిందే. అసలు మూడుసార్లు రామాయణాన్నే అచ్చంగా తీశారు కూడా. ఇక మిగతా సినిమాలు కూడా అన్నీ రామాయణంలో కథలనే ఇతివృత్తంగా తీసుకుని వాటికి సామాజిక రంగులు అద్ది సినిమాలుగా చూపించారు.రాముడి పాత్రకు ఎన్టీయార్‌ను తప్ప మరే ఇతర హీరోని ఊహించుకోవడానికి ఇష్టపడని తెలుగు ప్రేక్షకులకు కొత్త వెండితెర రాముళ్ళను చూపించారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. సినిమా తీసినప్పుడు ఆయనలోని ఆర్టిస్ట్, దర్శకుడు ఇద్దరూ ఒకటై పోతారు.

ఆది నుంచి విమర్శలే...అయినా సూపర్ హిట్

బాపు తీసిన మొట్టమొదటి రామాయణం సినిమా సంపూర్ణ రామాయణం. శోభనబాబు రాముడిగా, చంద్రకళ సీతగా చేశారు. ఎన్టీయార్‌తో కాకుండా శోభన్ బాబును రాముడిగా చూపిస్తున్నారు. ఇదెవరు చూస్తారు అన్నారు. రాముడిగా అతనేం బావుంటాడు అని ఎగతాళి చేశారు. కానీ అవన్నీ పక్కన పెట్టి అద్భుతాన్ని తీసి చూపించారు బాపు. అప్పటివరకూ వచ్చిన పౌరాణిక చిత్రాల్లో ‘రహస్యం’, ‘సతీ అనసూయ’ చిత్రాల తర్వాత భారీ వ్యయంతో రూపుదిద్దుకొన్న పౌరాణిక సినిమా ఇదే కావడం కూడా ఒ్ విశేషం. 1972లో విడుదల అయిన ఈ సినిమా ఓ దృశ్యకావ్యంలా తీశారు బాపు. ఆయనకు తెర మీద శోభన్‌బాబు, ఎస్వీ రంగారావు.. తెర వెనుక రచయిత ఆరుద్ర, సంగీత దర్శకుడు మహదేవన్‌, ట్రిక్‌ ఫొటోగ్రఫీ నిర్వహించిన రవికాంత నగాయిచ్‌ ఆయనకు అండగా నిలిచారు.

అచ్చమైన వాల్మీకి రామాయణం ఇది...

వాల్మీకి రామాయణంలో ఏ మార్పులు చేయకుండా తీసిని మూవీ సంపూర్ణ రామాయణం. ఇందులో కైకేయిగా జమున చేశారు. రావణుడిగా ఎస్వీరంగారావు, దశరథుడిగా గుమ్మడి నటించారు. విడుదల అయిన తర్వాత మొదట వారం రోజులు సినిమా ఏమీ ఆడలేదు. అందరూ విమర్శించారు. ఎన్టీయర్‌ను కాదని తీస్త ఇలానే ఉంటుందని అన్నారు. కానీ బాపూ, రమణలకు ఎక్కడో నమ్మకం...ప్లాప్ కాదు అని. వాళ్ళు అనుకున్నట్టుగానే సినిమా పెద్ద హిట్ అయింది. ‘లవకుశ’ చిత్రం తర్వాత మళ్లీ పల్లెల నుంచి జనం బళ్లు కట్టుకుని రావడం ‘సంపూర్ణ రామాయణం’ విషయంలోనే జరిగింది. శోభన్‌బాబు సొంత థియేటర్‌లో ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమా వేయించుకుని చూశారు. పూర్తయిన తర్వాత ఆయన్ని గుండెలకు హత్తుకుని అభినందించారు. ఇక ఈస్ట్‌మన్ కలర్‌ పౌరాణిక సినిమాల్లో పది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమాగా సంపూర్ణ రామాయణం రికార్డ్ సాధించింది.

సీతా కల్యాణం...అదో అద్భుతం..

సంపూర్ణ రామాయణం తర్వాత బాపూ తీసిన మరో సినిమా సీతా కల్యాణం. ఇందులో మొత్తం రామాయణం అంతా చూపించకుండా కేవలం సీతారాముల పుట్టుక నుంచి వారికి పెళ్ళయ్యే వరకూ మాత్రమే చిత్రంగా మలిచారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో...అవంటే ఏంటో తెలియని టైమ్‌లో అద్భుత దృశ్యకావ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు బాపు. ఈ సినిమాలో వచ్చే గంగావతరణం ఒక్కటీ చాలూ...చూడ్డానికి రెండూ కళ్ళూ సరిపోవు. ఇక సీతాదేవిగా జయప్రదను అత్యంత సుందరంగా చూపించారు బాపు. అలాగే ముక్కు ముఖం తెలియని రవి అనే కొత్త కుర్రాడిని ఇందులో రాముడిగా పరిచయం చేశారు. అతనికి అదే ఫస్ట్, లాస్ట్ సినిమా కూడా. ఈ సినిమాకు బాపు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. అంతేకాదు సీతాకల్యాణం సినిమాను 1978లో BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ , శాన్ రెనో, డెన్వర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. విదేశీ సినీ ప్రముఖులతో ప్రశంసలను అందికుంది.

మానవజాతికి ఆదర్శం..

రామాయణం, మహాభారతం కేవలం ఇతి హాసాలు కాదు. మానవ జీవితాదర్శాలు. ఏకాంలో అయినా...ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మనుషులు ఎలా జీవించాలో నేర్పే పాఠాలు. అందుకే తమ ప్రతీ సినిమాలో రామాయణాన్ని చూపించారు బాపూ, రమణలు. మనిషిగా ఎలా ఉండాలో, ఏం చేయాలో నేర్పినవాడు రాముడు. అందుకే తెలుగువారికే కాదు మొత్తం భారతావనికే శ్రీరాముడు ఆదర్శపురుషుడు. అందుకే ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు దేశమంతా ఎదరు చూస్తోంది. ఆ అద్భుత ఘట్టానికి తామూ సాక్ష్యులుగా నిలవాలని తహతహలాడుతోంది.

Advertisment
తాజా కథనాలు