DILL RAJU : సంక్రాంతి సినిమాల ఘాటు మాములుగా లేదు. బరిలోకి 5 సినిమాలు రిలీజ్ అని ముందు నుంచి అన్నారు. ఆతరువాత ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ పెట్టి దిల్ రాజు ఆద్యక్తతన ఆయా నిర్మాతలను ఒప్పించి ఎట్టకేలకు ఈగల్ సినిమా వాయిదా వేశారు. ఇక.. బరిలో గుంటూరు కారం, హనుమాన్ , సైoధవ్ , నా సామిరంగా చిత్రాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ ఒకరకంగా చిన్న సినిమానే . ఎంత ఒప్పించినా హనుమాన్ మేకర్స్ వాయిదాకు ఒప్పుకోకపోవడంతో పెద్ద సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ తరువాత హనుమాన్ చిత్రానికి మిగిలిన హాళ్లు కేటాయించారు. ఈ క్రమంలో దిల్ రాజుపై కొన్ని వైబ్ సైట్స్ నెగిటివ్ వార్తలు రాశాయి. ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు తప్పుడు వార్తలు, ఆధారాలు లేకుండా రాస్తున్న వెబ్ సైట్స్ కు మీడియా ముఖంగా స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చారు.
చిరంజీవిగారి మాటలను వక్రీకరించి రాశారు
వార్తలపై దిల్ రాజు మాట్లాడుతూ ..ప్రతీ సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజవుతున్నపుడల్లా డైరెక్ట్ గా , ఇన్ డైరెక్ట్ గా ఏదో ఒక కాంట్రవర్సీ లేపుతూ ప్రతీ సంక్రాంతికి నాపైన ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 8 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. హనుమాన్ ప్రీరిలీజ్ ఉత్సవ్ లో చిరంజీవి గారు నా గురించి , నా సినిమాల ఎక్సపీరియెన్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఆ మాటలను వక్రీకరించి రెండు ప్రముఖ వెబ్ సైట్స్ తప్పుడు వార్తలు రాశారు. . మీ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి నన్ను ఎందుకు వాడుకుంటున్నారు.దిల్ రాజు ఏమీ అనడు సాఫ్ట్ అని అనుకుంటున్నారా ? తాట తీస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
దిల్ రాజు అంటే బ్రాండ్..నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తా
మీకు దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ ను , నన్ను స్టేజ్ పైకి పిలిచి కూర్చోపెట్టండని ధ్వజమెత్తారు. దిల్ రాజు అంటే బ్రాండ్ అని మీరందరికి తెలుసు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సీలను మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రతీ సంక్రాంతికి మీ వెబ్ సైట్స్ , మీ యూట్యూబ్ ఛానల్స్ వాడుకుంటున్నారు. అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని ఘాటుగా స్పందించారు. నాపైన ఏదయినా తప్పుడు వార్తలు రాస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. తమిళ సినిమా డబ్బింగ్ చేస్తున్ననని కూడా రాసారని .. ఎవడ్రా మీకు చెప్పారు. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
ALSO READ:OG (Original Gangster) : పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నిర్మాత మారాడా ?