INDIA Alliance : ఎన్డీయేను దెబ్బతీసే యోచనలో ఇండియా కూటమి.. చంద్రబాబు, నితీష్‌కు గాలాలు ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు నెక్ టూ నెక్‌గా లీడింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఇండియా. ఎన్డీయే మిత్ర పక్షాలకు గాలాలను విసురుతోంది. By Manogna alamuru 04 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి NDA : ఎన్నికల ఫలితాల్లో (Election Results) అనూహ్యంగా విజయం సాధిస్తూ దూసుకువెళుతోంది ఇండియా కూటమి (India Alliance). ఎన్డీయే (NDA) కు గట్టిపోటీని ఇస్తోంది. రెండు కూటములకు పెద్ద తేడా లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది అనుమానాస్పదంగానే ఉంది. రెండింటికీ తేడా చాలా తక్కువే ఉంది. ఇప్పుడు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని అనుకుంటోంది కాంగ్రెస్. ఎలా అయినా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పావులు కదుపుతోంది. నితీష్ కుమార్ (Nitish Kumar) కు ప్రధాని పదవి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇందుకే అనే టాక్ వినిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి బాగా పుంజుకుంది. చాలా ముఖ్యస్థానాల్లో గెలిచి మంచి ఊపు మీద ఉంది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు మీద దృష్టి పెట్టింది. దీంతో ప్రతిపక్ష కూటమిలో వారైన శరద్ పవార్, నితీష్ కుమార్, చంద్రబాబులపైన ఫోక్స్ పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ముగ్గురితో సంప్రతించులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ సరిగ్గా ఎన్నికల ముందే బీజేపీతో చేతులు కలిపారు. నితీష్ అయితే ఇండియా కూటమి నుంచే ఎన్డీయేలోకి వెళ్ళారు. ఇప్పుడు గాలి కాంగ్రెస్ వైపు మళ్ళుతుండడంతో వాళ్ళిద్దరినీ తమవైకు లాక్కోవాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి ఒకరికి ప్రధానమంత్రి పదవి, మరొకరికి ప్రత్యేక హోదా ఎరలను వేసింది. ఈ రెండు పార్టీలు కనుక ఇండియా కూటమిలోకి వచ్చేస్తే అప్పుడు ఎన్డీయే కన్నా ఇడియా కూటమి ఆధిక్యంలోకి వెళ్ళిపోతోంది. దాంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చును. అందుకే కాంగ్రెస్ చంద్రబాబు, నితీష్ కుమార్‌కు ఫోన్ చేశారని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని శరద్ పవార్ ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఎవరికీ ఫోన్ చేయలేదని ఆయన అంటున్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం నేత సీతారాం ఏచూరితో మాట్లాడానని...వారు ఏమీ చెప్పలేదని అన్నారు. ఇక బీజేపీ తాను చెప్పిన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయింది. ౩౦౦ స్థానాలకు చేరువగా వస్తున్నా దాని కోసం చాలా కష్టపడుతోంది. బీజేపీ కంచుకోటలైన ఉత్తరప్రదశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. Also Read : గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్.. ఏకంగా నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు..! #congress #tdp #nithish-kumar #chandrabau #i-n-d-i-a మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి