Explainer What is Delhi Liquor Scam? : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరోసారి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తే ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకోవడం ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్‌లోని కల్వకుంట్ల కవిత నివాసంపై ఈడీ (ED), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ రైడ్స్ చేశారు. ఈడీ, ఐటీ శాఖకు చెందిన సుమారు 10 మంది అధికారులు కవిత నివాసానికి చేరుకుని ఎవరినీ లోపలికి రానివ్వకుండా తనిఖీలు చేపట్టారు. సోదాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కవిత నివాసం వద్ద తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గంటల తరబడి సోదాల కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. అక్కడ కవితను మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశముంది. గతేడాది నాటి ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంతి, ఆప్ నేత మనీశ్‌సిసోడియా ఇదే కేసులో అరెస్ట్ అవ్వగా.. ఇప్పటివరకు ఆయన బయటకు రాలేదు. ఇక కవితను కూడా అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కేసీఆర్ కుమార్తే పాత్ర ఉందా?
పూర్తిగా చదవండి..Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి?
కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: